NTV Telugu Site icon

ODI CWC 2023: ఆస్ట్రేలియా కంటే ముందే ఇంగ్లండ్, భారత్‌ మ్యాచ్.. హైదరాబాద్‌లో పాకిస్తాన్‌కు మరో మ్యాచ్‌!

India Odi

India Odi

Team India Schedule for ICC World Cup 2023 Warm Up Matches: వన్డే ప్రపంచకప్‌ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 5న మెగా సమరం మొదలయి.. నవంబరు 19న ముగుస్తుంది. ప్రపంచకప్‌ 2023లోని మొత్తం 48 మ్యాచ్‌లకు భారత్‌లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. చెన్నైలో అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత్ తన ప్రపంచకప్‌ పోరాటాన్ని ప్రారంభిస్తుంది.

ఆస్ట్రేలియా కంటే ముందే ఇంగ్లండ్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. వన్డే ప్రపంచకప్‌ 2023 ఆరంభానికి వారం​ రోజుల ముందు వార్మప్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. వార్మప్‌ మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 29న మొదలై.. అక్టోబర్‌ 3న ముగుస్తాయి. మెగా టోర్నీలో భాగంగా భారత్‌ రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరు 30న గౌహతిలో ఇంగ్లండ్‌‌తో మొదటి వార్మప్‌ మ్యాచ్‌, అక్టోబర్ 3న త్రివేండ్రంలో క్వాలిఫయర్-1తో రెండో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇక హైదరాబాద్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌ ఓ వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. సెప్టెంబర్‌ 29న న్యూజిలాండ్‌తో పాక్ తలపడనుంది.

Also Read: Apsara Rani Hot Pics: అప్సర రాణి అందాల జాతర.. ఆ థండర్‌ థైస్‌కి కుర్రకారుకు కంటిమీద కునుకు కష్టమే!

ఇక వన్డే ప్రపంచకప్‌ 2023కు ముందు భారత్ బిజీబిజీగా గడపనుంది. ఆసియా కప్‌తో పాటు నాలుగు జట్లతో సిరీస్లు ఆడనుంది. జులైలో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టెస్ట్, టీ20లతో పాటు మూడు వన్డేలు ఆడుతుంది. ఆగస్టులో ఐర్లాండ్‌‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. సెప్టెంబరులో ఆసియా కప్ 2023 ఉంటుంది. ఆగస్టులోనే ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్‌లు ఆడనుంది. ప్రపంచకప్‌ సన్నాహకంగా వీటిని భారత్ ఉపయోగించుకోనుంది.

వార్మప్‌ మ్యాచ్‌ల డీటెయిల్స్:
సెప్టెంబర్‌ 29: పాకిస్తాన్‌ vs న్యూజిలాండ్‌ (హైదరాబాద్‌)
సెప్టెంబర్‌ 30: భారత్ vs ఇంగ్లండ్‌ (గౌహతి)
అక్టోబర్‌ 3: భారత్ vs క్వాలిఫయర్‌-1 (త్రివేండ్రం)

Also Read: Samsung Galaxy M34 5G Launch: శాంసంగ్ నుంచి సూపర్ 5G స్మార్ట్‌ఫోన్.. ఓఐఎస్ ఫీచతో కెమెరా! ధర ఎంతంటే