ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో తిలక్ వర్మ వద్దు.. ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shikhar Dhawan Picks His No. 4 For 2023 ODI World Cup: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. భారత్ వేదికగా అక్టోబరు-నవంబరులో మెగా టోర్నీ జరగనుంది. ఈ ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం అన్ని జట్లు ఇప్పటికే తమ ప్రణాళికలు, కసరత్తులు మొదలెట్టాయి. భారత్ కూడా ప్రపంచకప్ లక్ష్యంగా జట్టుని సిద్ధం చేస్తోంది. అయితే మిడిలార్డర్లో కీలకం అయిన నాలుగో స్థానంపై అనిశ్చితి నెలకొంది. యువరాజ్ సింగ్ రిటైర్ అయిన తర్వాత ఆ స్థానంలో ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. గత ప్రపంచకప్‌లో కూడా ఇదే సమస్య కారణంగా భారత్ సెమీస్ నుంచి ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.
ఎందరో ఆటగాళ్ల అనంతరం చివరకు శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానం లోటును భర్తీ చేశాడు. అయితే గాయం కారణంగా అతడు గత కొన్ని నెలలుగా భారత జట్టుకు అందుబాటులో లేడు. అయ్యర్ జట్టుకు దూరమైన నేపథ్యంలో భారత్ మేనేజ్మెంట్ వేర్వేరు ఆటగాళ్లతో ప్రయోగాలు చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం అయ్యర్ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొలనడంతో.. రేసులో టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. సంజు శాంసన్ సహా యువ ఆటగాడు తిలక్ వర్మ కూడా నాలుగో నంబర్‌కు పోటీ దారులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read
Also Read: IND Playing 11 vs WI: గిల్‌పై వేటు.. ఓపెనర్‌గా యువ ఆటగాడు! నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే
ప్రపంచకప్ 2023లో నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించాలని శిఖర్ ధావన్ సూచించాడు. ‘నాలుగో స్థానంకు నేను సూర్యకుమార్ యాదవ్‌ను ఎంచుకుంటాను. ఎందుకంటే గత కొంతకాలంగా సూర్య అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. అతడు అనుభవజ్ఞుడు కూడా. ఐపీఎల్, భారత్ తరఫున మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ అనుభవం ఉపయోగపడుతుంది. నా ఛాయిస్ సూర్యకుమారే’ అని గబ్బర్ అన్నాడు. యువ సంచలనం తిలక్ వర్మ నాలుగో స్థానంలో మెరుగ్గా ఆడుతున్నా.. అనుభవం పేరిట సూర్య పేరును ధావన్ ఎంచుకోవడం విశేషం. చూడాలి మరి భారత మేనేజ్మెంట్, కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరికి ఓటేస్తారో.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు