Champions Trophy 2025: 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12న గడువు తేది నిర్ణయించింది. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించేందుకు మరింత ఆలస్యం కావచ్చు. తాజా సమాచారం ప్రకారం, బీసీసీఐ తన జట్టును సకాలంలో ప్రకటించడానికి ఐసీసీని మరికొంత సమయం డిమాండ్ చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం, ఐసీసీ సూచనలకు అనుగుణంగా, టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును సమయానికి ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. అయితే, ఓ నివేదిక ప్రకారం.. బీసీసీఐ జట్టు ప్రకటించడంలో వారం రోజుల ఆలస్యం జరగవచ్చని అంచనా వేసింది.
Also Read: Tamim Iqbal Retirement: బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ ప్లేయర్
ఐసీసీ సాధారణంగా అన్ని జట్లను తమ టోర్నమెంట్‌కు 4 వారాల ముందు తమ తాత్కాలిక జట్టును ప్రకటించమని అడుగుతుంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో పాకిస్థాన్, దుబాయ్‌లో జరిగే ఈ టోర్నీకి 5 వారాల ముందు జట్లను సమర్పించాలని ఐసీసీ కోరింది. జనవరి 12 లోపల జట్టు జాబితాను సమర్పించాలని ఐసీసీ అన్ని 8 జట్లను అభ్యర్థించింది. కాకపోతే, కొన్ని కారణాల వల్ల బీసీసీఐ జట్టు ప్రకటనలో ఆలస్యం అయ్యేలా కనపడుతుంది. ఈ నేపథ్యంలో జట్టు ఆటగాళ్ల పేర్లను జనవరి 18 లేదా 19 నాటికి ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఐసీసీకి ఇంకా ఏ జట్టు కూడా తమ జట్టును ప్రకటించలేదు. కాబట్టి బిసీసీఐ నిర్ణయానికి అనుగుణంగా ఐసీసీ నిర్ణయం మారవచ్చు. ఇక మరోవైపు, ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.