Site icon NTV Telugu

IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్స్‌

Ap Govt

Ap Govt

IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న కొత్త ఐఏఎస్‌లకు పోస్టింగ్స్ ఇచ్చింది. మార్కాపురం సబ్‌ కలెక్టర్‌గా వెంకట్‌ త్రివినాగ్, పాలకొండ సబ్‌ కలెక్టర్‌గా యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌గా కల్పశ్రీ, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌గా మౌర్య భరద్వాజ్, తిరుపత సబ్‌ కలెక్టర్‌గా రాఘవేంద్ర మీనా, పాడేరు సబ్‌ కలెక్టర్‌గా శౌర్యమన్‌ పటేల్, కందుకూరు సబ్‌ కలెక్టర్‌గా తిరుమణిశ్రీ పూజ, తెనాలి సబ్‌ కలెక్టర్‌గా సంజన సింహ నియామకమయ్యారు. వచ్చే నెల 9లోగా రిపోర్ట్‌ చేయాలని కొత్త సబ్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Read Also: Vande Bharat Express: ఏలూరులో తొలిసారి ఆగిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌

 

Exit mobile version