NTV Telugu Site icon

Inspirational Story: రైల్వే స్టేషన్‌లో పోర్టర్ టూ ఐఏఎస్.. శ్రీనాథ్ విజయగాథ..

Ias Srinath

Ias Srinath

IAS Srinath Inspirational Story: కేరళలోని ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌లో పోర్టర్‌గా పనిచేసిన శ్రీనాథ్ కథ అందరికి స్ఫూర్తి. ఆయన ఇబ్బందులను ఎదుర్కొని., తన కుమార్తె భవిష్యత్తును మెరుగుపరచడానికి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ఆదాయం తక్కువగా ఉండడంతో కూతురికి మెరుగైన విద్యను అందించి జీవితాన్ని అందించాలనే శ్రీనాథ్ ఆందోళన అతన్ని సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యేలా చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీనాథ్ తన కూతురికి మంచి జీవితం కోసం రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై, ఇయర్‌ఫోన్స్‌తో ఐఏఎస్ కావాలనే ఆయన కలను నెరవేర్చుకున్నాడు.

HBD Surya Kumar Yadav: 34వ పుట్టిన రోజు జరుపుకుంటున్న టీమిండియా టి20 కెప్టెన్..

నిజానికి అప్పట్లో ఆయనకి ఖరీదైన కోచింగ్ క్లాసుల్లో చేరేంతగా శ్రీనాథ్ ఆర్థిక పరిస్థితి లేదు. సొంతంగా చదువుకోవాలని నిర్ణయించుకుని రైల్వే స్టేషన్‌లో ఉన్న ఉచిత వైఫైని ఉపయోగించుకుని చదువుకున్నాడు. స్టేషన్‌ లోనే ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని నోట్స్‌ రాసుకుని.. ప్రిపరేషన్‌కు కొత్త దిశానిర్దేశం చేశాడు. ఈ సమయంలో, అతను స్టడీ మెటీరియల్ కొనడానికి కూడా డబ్బు లేదంటే నమ్మండి. కానీ., అతను తన కృషితో ఈ సవాలును ఎదుర్కొన్నాడు. ఇకపోతే., శ్రీనాథ్ మొదట కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో విజయం సాధించాడు. అది అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ విజయం తర్వాత అతను యూపిఎస్సి పరీక్ష కోసం సిద్ధం చేయడం ప్రారంభించాడు. తొలి మూడు ప్రయత్నాల్లో విఫలమైనా, వదలకుండా తన లక్ష్యం దిశగా సాగిపోయాడు.

ENG v AUS: ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం.. అదరగొట్టిన లివింగ్‌స్టోన్‌..

శ్రీనాథ్ కృషి ఫలించి నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఈ విజయం తర్వాత శ్రీనాథ్ ఐఏఎస్ అధికారి కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. కష్టాలు, పరిమితులు ఉన్నప్పటికీ నిజమైన కృషి, పట్టుదలతో ఏదైనా లక్ష్యాన్ని సాధించవచ్చని అతని కథ చూపిస్తుంది. తమ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడుతున్న వారందరికీ శ్రీనాథ్ కథ ఒక ఇన్స్పిరేషన్.