HBD Surya Kumar Yadav: 34వ పుట్టిన రోజు జరుపుకుంటున్న టీమిండియా టి20 కెప్టెన్..
- నేడు 34వ పుట్టినరోజును జరుపుకుంటున్న సూర్యకుమార్ యాదవ్.
- అభిమానులు ముద్దుగా 'స్కై' అని పిలుచుకుంటారు.
- ప్రస్తుతం టీ20లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
- సూర్య అనేక రికార్డులు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HBD Surya Kumar Yadav: భారత క్రికెట్ జట్టు టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈరోజు తన 34వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 2021లో 31 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సూర్య ఇప్పుడు టీ20లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. క్రికెట్ భారత క్రికెట్లో మిస్టర్ 360 అని పిలవబడే సూర్య, టి20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో డేవిడ్ మిల్లర్‌ను పట్టుకోవడం ద్వారా భారతదేశం రెండవసారి ఛాంపియన్‌గా మారడంలో ముఖ్యమైన సహకారం అందించాడు. సూర్యకుమార్ యాదవ్ 34వ పుట్టినరోజు సందర్భంగా అతని కెరీర్లో టాప్ రికార్డులను ఒకసారి చూద్దాం.
* అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సూర్యకుమార్ ఇప్పటి వరకు 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. వీరి తర్వాత మలేషియాకు చెందిన వీరెందీప్ సింగ్, భారత ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. కానీ సూర్య కనీసం 71 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
Also Read
- Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
- Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
- Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
- Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం
* టీ20లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డు సృష్టించాడు. 2022లో 31 మ్యాచ్‌ల్లో 1164 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి.
* భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఆటగాడు. సూర్య ఇప్పటివరకు 71 మ్యాచ్‌లలో 68 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు సాధించాడు. వీరి కంటే ముందు భారత్‌కు చెందిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్వెల్ మాత్రమే ఐదు సెంచరీలతో ముందు ఉన్నారు.
* ఇప్పటివరకు, అతను 71 మ్యాచ్‌లలో 68 ఇన్నింగ్స్‌లలో 168.65 స్ట్రైక్ రేట్‌తో 2332 పరుగులు చేశాడు.
* టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఐదో బ్యాట్స్‌మెన్ సూర్య. ఇప్పటి వరకు 136 సిక్సర్లు కొట్టాడు.
* టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ ఏడో స్థానంలో ఉన్నాడు. 24 అర్ధ సెంచరీలు సాధించాడు.
* ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!