Site icon NTV Telugu

IAS officers: సచివాలయానికి ఆ ఐఏఎస్‌ల క్యూ..!

Ap Secretariat

Ap Secretariat

IAS officers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిన తర్వాత భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు.. ఈ మధ్యే 19 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.. కొందరు వివిధ శాఖలు కేటాయించిన సర్కార్‌.. శ్రీలక్ష్మీ , రజిత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డి లాంటి వారిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. అయితే, ఇప్పుడు ఏపీ సచివాలయానికి క్యూ కడుతున్నారు అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారులు.. జీఏడీకి రిపోర్ట్ చేసేందుకు సెక్రటేరియట్‌కు వస్తున్నారు పలువురు ఐఏఎస్‌లు.. ఇప్పటికే తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల మాజీ కలెక్టర్లు మాధవీలత, వేణుగోపాల్ రెడ్డి.. జీఏడీలో రిపోర్ట్‌ చేశారు.. మరికొందరు సీనియర్ ఐఏఎస్‌లు జీఏడీలో రిపోర్ట్ చేసినట్టు సమాచారం. అయితే, జీఏడీకి రిపోర్ట్ చేసిన అధికారులకు ఎప్పటిలోగా పోస్టింగులు దక్కుతాయో అనేదానిపై క్లారిటీ లేదు.. మరోవైపు.. అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఐఏఎస్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు సిద్ధం అవుతోంది.

Read Also: Shocking Video : పట్టపగలు మహిళపై బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసిన దుండగులు..

Exit mobile version