NTV Telugu Site icon

Minister Ambati Rambabu: చచ్చేంత వరకు సీఎం జగన్‌ వెంటే.. పార్టీ మారను..

Ambati Rambabu

Ambati Rambabu

Minister Ambati Rambabu: చచ్చేంత వరకు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటా.. పార్టీ మారను.. మారబోను అంటూ స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు రుణ మాఫీ అని మహిళలను మోసం చేశాడు.. బంగారు రుణాలు మాఫీ అని చేతులు ఎత్తే శాడు.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు.. అందుకే వై ఎపీ నీడ్స్ జగన్ అని ప్రజల్లోకి వెళ్తున్నాం అన్నారు. ఏ రాష్ట్రాల్లో కూడా అమ్మ ఒడి లాంటి పథకం లేదు .. పేదలకు కోసం అహర్నిశలు కష్ట పడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కావాలి అన్నారు. డ్వాక్రారుణ మాఫీ చేసిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి.. గ్రామానికే పాలన తెచ్చారు.. రైతు భరోసా, సచివాలయం, వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటు చేశారు.. భూముల రిజిస్ట్రేషన్ సైతం ఇక్కడే జరుగుతున్నాయి.. మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారని తెలిపారు.

Read Also: Harirama Jogaiah: టీడీపీ-జనసేన మినీ మేనిఫెస్టోపై హరిరామ జోగయ్య అసంతృప్తి

సీఎం జగన్మోహన్ రెడ్డే మరలా రాష్ట్రానికి సీఎం కావాలి ప్రజలు కోరుకుంటున్నారు అని తెలిపారు మంత్రి అంబటి.. నిరుద్యోగ భృతి, రైతులకు ,డ్వాక్రా మహిళలను రుణమాఫీ అనిమోసం చేశాడు చంద్రబాబు.. అందుకే ముఖ్య మంత్రిగా చంద్రబాబు పనికిరాడన్న ఆయన.. నాకులం వాడే చంద్రబాబు కోసం ఆరాట పడుతున్నాడు అంటూ పవన్‌ కల్యాణ్‌పై మండిపడ్డారు. అన్ని పోటీ చేయమంటే బాబు చెప్పినవే చేస్తా అంటున్నాడు.. మన వారు సీఎం సీఎం అంటుంటే పవన్ కల్యాణ్‌ గుండెల్లో గుబులు పుట్టిస్తోందన్నారు. రాష్టవ్యాప్తంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలు జరగుతున్నాయి.. 2019 ఎన్నికల్లో 175 నియోజిక వర్గాల్లో 151 సీట్లతో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి మీరు అండగా నిలిచారు .. పసుపు కుంకుమ ఇస్తే చంద్రబాబు పార్టీని ఆయన కుమారుడిని ఇంటికి పంపారు.. 23 సీట్ల గతి టీడీపీకి పట్టిందని ఎద్దేవా చేశారు.

Read Also: BJP MP Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్ ల డీఎన్ఏలు ఒక్కటే.. వాళ్లకు ఓటేస్తే హోల్ సేల్ గా అమ్ముడు పోతారు..

ఇక, చంద్ర బాబు జైల్లో ఉంటే పవన్ కల్యాణ్‌ తప్ప పర పార్టీ వారు ఒక్కరూ వెళ్ళ లేదు అని దుయ్యబట్టారు అంబటి.. పవన్ కల్యాణ్‌ సపోర్ట్ చేశాక అవినీతి పాలన చేసిన చంద్రబాబు అవినీతిలో.. మన వాడికి వాటా ఉందా లేదా..? అని ప్రశ్నించారు. టీడీపీ వారు మావాడు కడిగిన ముత్యంగా వాస్తాడు అన్నారు.. కంటి ఆపరేషన్ కోసం వచ్చాడు అంటూ సెటైర్లు వేశారు. ఇచ్చిన మాట నిలుపుకుని చిత్త శుద్దితో పాలన చేసిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి.. 2 లక్షల 30 వేల కోట్లు పేదల ఖాతాలకు చేర్చిన మహా నేత ఆయన.. ఇంటికే పించన్ ఇస్తున్న నాయకుడు.. జనవరిలో మూడు వేలు పించన్ పేదలకు చేర్చుతున్నారు అని వివరించారు. గతంలో ఎన్టీఆర్‌ కానీ చంద్రబాబుకానీ ఇంత మేలు చేశారా..? అని ప్రశ్నించారు.. గతంలో ఏ ముఖ్య మంత్రి కూడా సీఎం జగన్‌ అడి గెలా అడగలేదు.. నీ కు మా ప్రభుత్వా హయంలో మేలు జరిగుతేనే ఓటు వేయండి అన్ని దమ్ముగా చెబుతున్నారు.. నూటికి 87 కుటుంబాలను మేలు చేశారు కాబట్టే గుండె ధైర్యం తో అడుగుతున్నారని తెలిపారు.

Read Also: Hyderabad: బజార్ ఘాట్ అగ్ని ప్రమాద ఘటన.. రంగంలోకి క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం

గతంలో అరోగ్య సురక్ష లా గ్రామాల్లోఇన్ని పరీక్షలు చేశారా..? పేదవాడి ఆరోగ్య రక్షణ కోసం పాటు పడుతున్నారు కాబట్టే ఈ రాష్ట్ర నికి సీఎం గా జగన్మోహన్ రెడ్డి కావాలనీ అడుగుతున్నాను.. అన్నారు మంత్రి అంబటి.. గతంలో చంద్రబాబు, ఎన్టీఆర్ ప్రభుత్వ బడులను పట్టించుకున్నారా..? అని ప్రశ్నించిన ఆయన.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చారు.. కాపు సామాజిక వర్గం మహిళలకు కాపు నేస్తం ఇచ్చారు.. కానీ, కాపులను బీసీల్లో కలుపు తామని టీడీపీ వారు మోసం చేశారు.. ముద్రగడను చిత్రహింసలు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు.. వంగ వీటి రంగాను హత్య చేసిన వ్వక్తి చంద్రబాబు.. ఖమ్మం లో వారి సామాజిక వర్గం వారు చంద్రబాబు ను విమర్శలు చేస్తున్నాని దాడికి యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ వాళ్లకు సపోర్ట్ చేస్తే దుర్మార్గ మైన ఆలోచన చేస్తాడు చంద్రబాబు.. 30 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది.. 2024లో పేదలకు పెత్తం దారుల మధ్య జరిగే ఎన్నిక ఇది.. పేదల తరపున పోటీ చేసి గెలిచే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.. పవన్.. చంద్రబాబు ను భుజానికి ఎత్తుకున్నాగెలిచేది జగనే.. 175కు 175 ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు మంత్రి అంబటి రాంబాబు.