NTV Telugu Site icon

Malla Reddy: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. మాజీమంత్రి కీలక ప్రకటన

Malla Reddy

Malla Reddy

మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. ఇదిలా ఉంటే.. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఐదేళ్లు బీఆర్ఎస్ ను వదిలేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి వైదొలుగుతానని మల్లారెడ్డి తెలిపారు.

Read Also: konda vishweshwar reddy: చేవెళ్లలో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది..

ఇదిలా ఉంటే.. గురువారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ ను మల్లారెడ్డి కలిశారు. తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, తనయుడు భద్రారెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ మళ్లీ పుకార్లు గుప్పుమన్నాయి. దీనిపై మల్లారెడ్డి స్పందించారు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో ఆయనను కలిశానని.. కర్ణాటక కాంగ్రెస్ నేతను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలిపారు. డీకే శివకుమార్ తనకు స్నేహితుడని.. బిజినెస్ పనుల మీద ఆయనను కలిసినట్లు చెప్పారు. యూనివర్శిటీ కొనుగొలు విషయంలో తనను మధ్యవర్తి తీసుకెళ్ళాడని.. ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు మల్లారెడ్డి.

Read Also: Supreme Court: శరద్‌ పవార్‌ పేరు, ఫొటోపై ఎన్సీపీకి కీలక ఆదేశాలు