Site icon NTV Telugu

KL Sharma: అమేథీలో స్మృతి ఇరానీని ఓడించి తీరుతా

Saeke

Saeke

అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఓడించి తీరుతానని కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్.శర్మ పేర్కొన్నారు. ఉత్కంఠ పోరు మధ్య అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారు. అనూహ్యంగా కిశోరి లాల్ శర్మ తెరపైకి వచ్చారు. కేఎల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్మృతి ఇరానీని ఓడిస్తానని అన్నారు. అమేథీ నుంచి పోటీ చేయడమనేది అధిష్టానం నిర్ణయం అని చెప్పారు. తాను స్మృతి ఇరానీని ఓడించడం ఖాయమని.. ఇది తాను చేస్తున్న పెద్ద ప్రకటన అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Revanth reddy: ఆచితూచి ఓటువేయకపోతే రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం

1983లో యూత్ కాంగ్రెస్ ద్వారా తాను అమేథీకి వచ్చినట్లు తెలిపారు. తాను స్వచ్ఛమైన రాజకీయ నాయకుడినని కేఎల్ శర్మ తెలిపారు. లూథియానాకు చెందిన శర్మ 1983లో రాజీవ్ గాంధీతో కలిసి పనిచేయడంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1991లో రాజీవ్ గాంధీ తర్వాత, అతను కెప్టెన్ సతీష్ శర్మతో కలిసి అమేథీలో పనిచేశారు. ఆ తరువాత సోనియాగాంధీ 1999లో అమేథీ నుంచి తొలిసారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. కొంతకాలం తర్వాత అతను రాయ్‌బరేలీ, అమేథీ రెండు స్థానాలకు ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశారు.

ఇది కూడా చదవండి: KCR: బీఆర్ఎస్ గెలిస్తేనే జగిత్యాల జిల్లా ఉంటుంది.. లేదంటే..!

అమేథీ స్థానం గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటిది. అలాంటిది గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. 55 వేల ఓట్ల మెజార్టీతో స్మృతి ఇరానీ విజయం సాధించారు. ఈసారి కూడా అమేథీ నుంచి రాహుల్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. అనూహ్యంగా రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగారు.

Exit mobile version