Gopireddy Srinivasareddy: మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడి అన్ని రాజకీయ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సీఎంవో కార్యాలయానికి నేతలు క్యూకడుతున్నారు. సీఎంవోకు వచ్చిన నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు మరో సారి సీటు ఖరారైనట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఆయన నరసారావుపేట నుంచి మరోసారి పోటీ చేయనున్నారని తెలుస్తోంది.
Read Also: YSRCP: మూడో లిస్ట్‌పై కొనసాగుతున్న వైసీపీ కసరత్తు
నరసారావుపేట సీటు విషయమై పార్టీ ముఖ్యనేతలతో గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా.. నరసారావుపేట నుంచి తనకు సీటు ఖరారైందని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో నరసారావుపేట నుంచే పోటీ చేస్తున్నానని తెలిపారు. ఎన్నికల ముందు సీటు కోసం ఆశావహులు ప్రయత్నించడం సహజమేనన్నారు. నియోజకవర్గంలో అసమ్మతితో నేతలు ఆందోళనలు చేయడం మామూలేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆందోళనలతో నష్టమేమీ లేదన్నారు. కుటుంబంలో కలహాలు సహజమేనని.. దాన్ని సరి చేసుకుంటామన్నారు. లింగంకొండ అగ్రహారం భూముల విషయంలో చర్చించేందుకు సీఎంవోకు వచ్చానని వెల్లడించారు. భూముల సమస్యలను పరిష్కరించుకున్నామన్నారు.