NTV Telugu Site icon

MP Ayodhya Rami Reddy: ఏదేమైనా జగన్ వెంటే ప్రయాణం.. ఆ ప్రచారం అవాస్తవం

Ayodhya Rami Reddy

Ayodhya Rami Reddy

MP Ayodhya Rami Reddy: 10 మంది రాజ్యసభ సభ్యులు బయటకి వెళ్లిపోతున్నారు అనే ప్రచారం అవాస్తవమని వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఒకరిద్దరు బయటకి వెళ్లినా మాకు నష్టం లేదన్నారు. మిగిలిన వాళ్లం పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పని చేస్తామన్నారు. మా గురించి మేము ఇలా చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. పదవి అంటే బాధ్యత, త్యాగంతో కూడుకున్నదని ఎంపీ తెలిపారు. రాజకీయాన్ని, పదవులను స్వార్థం కోసం వాడుకుంటే నష్టపోతారని వెల్లడించారు. ఈరోజుల్లో పార్టీలు నడపడం చాలా కష్టసాధ్యం అవుతుందన్నారు. అన్ని అనుకున్నట్టే అవ్వాలంటే రాజకీయాల్లో కుదరదన్నారు. వ్యక్తిగత స్వార్థాలు ఉంటే రాజకీయాల్లో ఉండకూడదని ఆయన వివరించారు.

Read Also: Pilli Subhash Chandra Bose: రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌తోనే ఉంటాను..

జగన్ సామాన్యుడి గురించి ఆలోచించే వ్యక్తి అని.. ఎవరికి సహాయం అవసరమో వాళ్ల కోసం జగన్ పార్టీ పెట్టాడన్నారు. ఏదేమైనా జగన్ వెంటే ప్రయాణం చేద్దాం అనే రాజకీయాల్లోకి వచ్చానని ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పష్టం చేశారు. మోపిదేవి అంటే మాకు ఇష్టమని.. ఆయనకి మరింత బలం ఇవ్వడానికే ప్రయత్నించామన్నారు. ఎమ్మెల్సీ, మంత్రి, రాజ్యసభ వంటి పదవులు ఆయనకి ఇచ్చామన్నారు. ఇబ్బందులు ఉన్నాయని పార్టీలు మారిపోతే విలువలు ఉండవన్నారు. ఇబ్బందులు ఉన్నా జగన్ వెంటే ఉంటా.. ఉండాలని ఎంపీ తెలిపారు. మాకు పదవి వచ్చింది వైసీపీ వల్లేనని.. ఇదే బాధ్యతతో ఉంటానన్నారు. వ్యక్తిత్వ హననం చేసి మాపై వార్తలు ప్రచారం చెయ్యవద్దని ఎంపీ అయోధ్య రామిరెడ్డి కోరారు.