తాను పార్టీ మారుతున్నాను అన్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.. పార్టీ విజయాల బాటలో ఉన్నప్పుడు అన్ని సక్రమంగానే కనపడతాయని, ఓటమి ఎదురైనప్పుడే నాయకులు పోరాటం చేయాలని సూచించారు.. విజయసాయిరెడ్డి ఒత్తిళ్లకు భయపడే వ్యక్తి కాదని, రాజకీయాలకు ఎందుకు దూరం అయ్యారన్నది ఆయన వ్యక్తిగతమన్నారు.
10 మంది రాజ్యసభ సభ్యులు బయటకి వెళ్లిపోతున్నారు అనే ప్రచారం అవాస్తవమని వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఒకరిద్దరు బయటకి వెళ్లినా మాకు నష్టం లేదన్నారు. మిగిలిన వాళ్లం పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పని చేస్తామన్నారు.
MP Ayodhya Rami Reddy: వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుందని.. అనేక సంస్కరణలు జరుగుతున్నాయని తెలిపారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై గొప్పలు చెప్పుకునే అవసరం వైసీపీ నాయకులకు లేదు.. గడిచిన మూడున్నర ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన వాస్తవ అభివృద్ధి మాత్రమే మేం ప్రజలకు చెప్పదలుచుకున్నాం అన్నారు. త్వరలో వైజాగ్ లో మెగా పారిశ్రామిక సమ్మిట్ పెడుతున్నాం.. రాష్ట్రానికి పెద్ద…