Hyundai December Delight: దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) ఈ ఏడాది చివరి ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ డిలైట్ 2025 పేరుతో విడుదలైన ఈ స్కీమ్ కింద.. కస్టమర్లు ఎంపిక చేసిన హ్యుందాయ్ కార్లపై ఏకంగా రూ.1 లక్ష వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఆఫర్లు డిసెంబర్ 2 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ స్కీమ్‌లో హ్యుందాయ్ ప్రస్తుత లైనప్‌లో ఉన్న హాచ్బ్యాక్లు, సెడాన్లు, SUVలు ఉన్నాయి. మోడల్, వెరియంట్‌ను బట్టి ఆఫర్లు మారుతాయి. వీటిలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ కేటగిరీ రిలీఫ్‌లు వంటి లాభాలు ఉన్నాయి. అయితే ప్రతి డీలర్షిప్ వద్ద స్టాక్, వెరియంట్ లభ్యత, అలాగే కస్టమర్ అర్హతను బట్టి ఆఫర్లు తేడా ఉండొచ్చు.
నేడే POCO C85 5G లాంచ్.. భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, ఇంకా మరెన్నో.. బడ్జెట్ లోనే గురూ..!
ప్రచారంలో భాగంగా i20, గ్రాండ్ i10 నీయోస్, ఆరా, ఎక్స్టర్, వెన్యూ, అల్కజార్, వెర్నా మోడల్స్ కు ఈ ఆఫర్స్ వర్తించనున్నాయి. ప్రతి కారుకు ట్రిమ్, పవర్‌ట్రైన్‌ను బట్టి ప్రత్యేక లాభాలు అమలు కానున్నాయి. అన్ని వెరియంట్లకు కాకుండా.. కేవలం ఎంపిక చేసిన వెర్షన్లపైనే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. తాజాగా హ్యుందాయ్ కొత్త జనరేషన్ వెన్యూ SUV ను విడుదల చేసింది. అలాగే గత రెండు నెలల్లో GST రేట్ల మార్పుతో హ్యుందాయ్ విక్రయాలు మరింత పెరిగాయి. దీని ప్రభావంతో డిసెంబర్ నెలలో అధిక డిమాండ్ వస్తుందని డీలర్లు భావిస్తున్నారు.
Russia-India: “దోస్త్ మేర దోస్త్”.. పుతిన్ పర్యటనకు ముందు భారత్‌కు రష్యా బిగ్ గిఫ్ట్..
సంవత్సరం చివరి నెలలో మోడల్ ఇయర్ అప్డేట్లు, జనవరిలో వచ్చే కొత్త ధరలకు ముందే కొనుగోలు చేయాలని చాలా మంది ఆసక్తి చూపుతారు. అందుకే i20, గ్రాండ్ i10 నీయోస్, ఆరా వంటి హై-వాల్యూమ్ కార్లు ఈసారి కూడా ఎక్కువగా అమ్ముడవుతాయని అంచనా. అలాగే ఎక్స్టర్, వెన్యూ వంటి SUVలకు కూడా మంచి డిమాండ్ ఉండొచ్చని అంచనా.
Hyundai December Delight is LIVE! 🔥People are rushing to grab the biggest deals of the season — massive savings you don’t want to miss. 📷⏳
Offers start TODAY. Hurry before stocks run out! #HyundaiIndia #Hyundai #ILoveHyundai #DecemberDelight pic.twitter.com/fikCQVLfR6— Hyundai India (@HyundaiIndia) December 1, 2025