సోషల్ మీడియా పోస్టుల విఫరీత ధోరణలు కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వారసులు, పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి రెండో భార్య మారుతీ మహలక్ష్ముమ్మను కూడా వదిలిపెట్టలేదు. తనపై సోషల్ మీడియా వేదిగా అమానవీయ పోస్టులు పెడుతున్నారని, తన సంతానంపై వస్తున్న నిందలను నివృత్తి చేసేందుకు డిఎన్ఏ టెస్టులు చేసి వాస్తవాలు వెల్లడించాలంటూ సీఎంను కోరడం సంచలనం కలిగిస్తోంది. నాలుగేళ్ళుగా తనపై ప్రత్యర్ధులు ఇష్టాను సారంగా ఆరోపణలు చేస్తూ, తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పోస్టులు పెడుతూ చేస్తున్న ప్రచారాలపై ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా అటు పోలీసులు గానీ, ఇటు ప్రభుత్వ పెద్దలు గానీ చర్యలు తీసుకోకపోవడంతో వారు చెలరేగిపోతున్నారని మారుతీ మహలక్షుమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
రాష్ట్ర ముఖ్యమంత్రి, డిఫ్యూటీ సీఎం మొదలు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు ఇకనైనా స్పందించి తనకు న్యాయం చేయాలంటూ పూర్వ పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహలక్ష్మమ్మ కోరుతున్నారు. ఈమేరకు ఆమె విడుదల చేసిన ఓ సెల్పీ వీడియో కలకం రేపుతోంది. ఒక తల్లి తనపై వచ్చిన ఆరోపణల నేపత్యంలో తన సంతానం ఎవరిదో తేల్చమని కోరడం బ్రహ్మంగారి మఠలంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని మరోమారు స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం తనపై చేస్తున్న దుష్ప్రచారాలను భరించలేకపోతున్నానని, తనపై అమానవీయ తప్పుడు ప్రచారాలు చేసి మానసికంగా హింసించే కంటే తన ప్రత్యర్ధులకు తనను రాళ్లతో కొట్టి ఒక్కసారిగా చంపేందుకు అవకాశం, వారికి రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. కడప జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి చర్యలు లేకపోడంతో చివరకు తన సంతానం ఎవరో.. ప్రభుత్వ పెద్దలే తేల్చాలంటూ గురు పత్ని సంచలన ప్రకటన చేయడం బ్రహ్మంగారి మఠంలో జరుగుతున్న సోషల్ మీడియా దాడులను మరో మారు బట్టబయలు చేసింది.