NTV Telugu Site icon

HYDRA: నేడు మాదాపూర్‌లో కూల్చివేతలకు రంగం సిద్దం

Hydraa

Hydraa

HYDRA: హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) నేడు (ఆదివారం) మాదాపూర్‌లో అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన 6 అంతస్తుల భారీ భవనాన్ని కూల్చివేసేందుకు సిద్ధమవుతోంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా నిర్మించబడుతున్న ఈ భవనం అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడంతో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభమయ్యాయి. స్థానికులు ఈ అక్రమ నిర్మాణంపై పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగింది. ఫీల్డ్ విజిట్‌ చేసి పరిశీలించిన హైడ్రా కమిషనర్ భవనానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారించారు. ఈ భవనంపై గతంలో పలు మార్లు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ, బిల్డర్ అధికారులు చెప్పిన నిబంధనలను పట్టించుకోలేదు. అనుమతులు లేకుండా భారీ నిర్మాణాన్ని కొనసాగించారు.

Also Read: Mallu Bhatti Vikramarka: వరంగల్ జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం

ఈ నేపథ్యంలో స్థితిగతులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, భవనాన్ని వెంటనే కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ చర్య తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. హైడ్రా అధికారులు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ నిర్మాణాలపై గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవన నిర్మాణానికి ముందు అవసరమైన అనుమతులు పొందకపోతే కఠినమైన చర్యలు ఎదురవుతాయని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో హైడ్రా నిర్లక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు. ఈ చర్యతో మాదాపూర్‌లోని ఇతర అక్రమ నిర్మాణాలకు కూడా హెచ్చరికగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Show comments