బెంగళూరులో హైడ్రా బృందం పర్యటిస్తుంది. రెండు రోజుల పాటు బెంగళూరులో హైడ్రా పర్యటన కొనసాగనుంది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు CSR కింద కొన్ని కంపెనీలు అభివృద్ధి చేసిన చెరువులను హైడ్రా బృందం స్టడీ చేయనుంది. తక్కువ ఖర్చుతో బెంగుళూరులో కర్ణాటక ప్రభుత్వం 35 చెరువులను అభివృద్ధి చేసింది. చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్షేత్రస్థాయిలో హైడ్రా బృందం పరిశీలించనుంది. ఈ పర్యటనలో రంగనాథ్‌తో పాటు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సిటీలో మొదటి దశలో నాలుగు చెరువుల ప్రక్షాళనపై ఫోకస్ పెట్టనుంది హైడ్రా. బాచుపల్లి ఎర్రగుంట చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, కూకట్‌పల్లి నల్ల చెరువు, రాజేంద్రనగర్ అప్పా చెరువులకు పునరుజ్జీవం తీసుకురానుంది హైడ్రా.
Read Also: Amritsar Golden Temple: గోల్డెన్ టెంపుల్‌లో యువతి ఆత్మహత్య.. ఏడో అంతస్తు నుంచి దూకి…
బెంగళూర్ పర్యటనలో భాగంగా.. కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ (KSNDMC)ను హైడ్రా బృందం సందర్శించింది. ముందస్తుగా వర్షం సమచారం ప్రజలకు చేర్చడం.. ఎంత మొత్తం వర్షం పడబోతోంది.. వరద ముంచెత్తే ప్రాంతాల వారిని అలర్ట్ చేయడం.. ట్రాఫిక్ జామ్ అలెర్ట్.. ప్రత్యామ్నాయ రహదారులను సూచించే విధానాలపై అధ్యయనం చేసింది. బెంగళూర్ మేఘసందేశం యాప్ పనిచేసే విధానం, ఆప్ ద్వారా ఈ ప్రాంతాల్లో ఎంత మొత్తం వర్షం పడుతోంది.. వరద, ట్రాఫిక్ జామ్, వడగళ్ల వాన ఇలా సమాచారం ఇచ్చే విధానం.. వరద ముప్పు ఉన్న ప్రాంతాలను అప్రమత్తం చేయడం.. వరద కాలువలు ఎంత మొత్తం నీరు వెళ్తోంది.. ఎక్కడ చెత్త పేరుకుపోయింది.. వివరాలను అలర్ట్ చేసే సెన్సార్ విధానంపై అధ్యయనం చేశారు. 20 ఏళ్ల డేటాతో ఎన్ని సెంటిమీటర్ల వర్షం పడితే వరద ముప్పు ప్రాంతాలను అంచనా వేయడం తదితర సమాచారం.. కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్‌లో వర్షపాతం నమోదు, గాలి వేగం, ఉష్ణోగ్రతల వివరాలు చెప్పే వాతావరణ కేంద్రాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు.
Read Also: CM Chandrababu: సోషల్ మీడియాలో పోస్టులపై సీఎం సీరియస్.. ఆడబిడ్డల జోలికి వస్తే సహించేది లేదు..