Site icon NTV Telugu

Hydra: ఫిర్యాదు అందిన 3 గంటల్లోనే.. పార్కును కాపాడిన హైడ్రా

Hydra

Hydra

ప్రభుత్వ స్థలాలు, చెరువులు,నాళాలు, బఫర్ జోన్ లోని స్థలాలు కబ్జాల బారి నుంచి కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా చర్యలతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటే నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైడ్రా స్పందించిన తీరుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు చేసిన 3 గంటల్లోనే హైడ్రా పరిష్కారం చూపింది. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలోని జీడిమెట్ల గ్రామం సర్వే నెంబర్ 218, 214లో ఉన్న రుక్మిణి ఎస్టేట్స్ కు చెందిన పార్కును కాపాడింది.

Also Read:Saquib Nachan: ఐసిస్ ఉగ్రసంస్థ ఇండియా చీఫ్ సక్విబ్ నాచన్ మృతి..

1200 గజాల పార్కు ఉంటే తప్పుడు పత్రాలతో సగానికి పైగా కబ్జా చేసారు. ఈ కబ్జాలు తొలగించాలని కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ముందు రుక్మిణి ఎస్టేట్స్ రెసిడెన్షియల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేశారు. అటునుంచి నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ ని కలసి ఇదే విషయాన్ని ఫిర్యాదు చేశారు. వెంటనే జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ కి ఫోన్ చేసి ఆక్రమణలు తొలగించాలని హైడ్రా కమిషనర్ సూచించారు. మధ్యాహ్నం ఫిర్యాదు అందగా సాయంత్రానికే మున్సిపల్ సిబ్బందితో కలసి హైడ్రా రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించింది.

Also Read:RGV : అంతా ప్రభాస్ కోసం వెళ్తున్నారు.. నేను విష్ణు కోసం వెళ్తా..

ఆ వెంటనే పార్కు ప్రహరీ నిర్మించింది. 3 గంటల్లోనే సమస్య పరిష్కారం అవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేవు.. శనివారం ఉదయం వేకువ జామునే పార్కులోకి వచ్చిన నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. పార్కు ప్రొటెక్టెడ్ బై హైడ్రా బోర్డును చూసి మురిసిపోయారు. ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. హైడ్రా చర్యలను అభినందించారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ కి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version