NTV Telugu Site icon

Hydra: ఘట్కేసర్‌లో కూల్చివేతలకు రంగం సిద్ధం..

Hydra

Hydra

హైడ్రా కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఘట్కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను కూల్చివేతకు హైడ్రా రెడీ అయ్యింది. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు అనేకమైన ఫిర్యాదులు అందాయి. సర్వే చేసి హైడ్రా.. అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి, కూల్చివేతలకు సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.

READ MORE: Dead Body On Bicycle: సైకిల్‌పై 15 కి.మీ. తల్లి మృత దేహాన్ని మోసుకెళ్లిన కొడుకు

ఇదిలా ఉండగా.. భవిష్యత్తు తరాలకు ఓ మంచి నగరాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో హైడ్రా ఏర్పాటైందని, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ గతంలో స్పష్టంచేశారు. నిర్మాణ అనుమతితో సంబంధం లేకుండా.. గతేడాది జులైకి ముందు కట్టిన ఏ ఒక్క ఇంటిని కూడా హైడ్రా కూల్చలేదని.. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల్లోని వ్యాపార కేంద్రాలను, నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాలను మాత్రమే నేలమట్టం చేసినట్లు తెలిపారు.

READ MORE: Private Junior Colleges: ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు కోర్టులో దక్కని ఊరట.. విద్యార్థులపై భారం..