NTV Telugu Site icon

HYDRA : చెరువుల‌ను గుర్తించేందుకు హైడ్రా భారీ క‌స‌ర‌త్తు

Hydra

Hydra

గొలుసుక‌ట్టు చెరువుల‌కు ప్రసిద్ధి చెందిన న‌గ‌రంలో అస్సలు ఎన్ని చెరువులుండేవి.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్కతేల్చేందుకు స‌ర్వే ఆఫ్ ఇండియాతో క‌లిసి హైడ్రా ప‌ని చేస్తోంది. హ‌బ్సిగూడలో ఉన్న స‌ర్వే ఆఫ్ ఇండియా కార్యాల‌యానికి మంగ‌ళ‌వారం త‌న అధికారుల బృందంతో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ వెళ్లారు. స‌ర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ ప‌రీడా, సూప‌రింటెండెంట్ ఆఫ్ స‌ర్వే డేబ‌బ్రత పాలిట్‌తో పాటు ఇత‌ర అధికారుల‌తో హైడ్రా ఉన్నతాధికారుల‌ స‌మావేశమయ్యారు. ఈ సందర్భంగా స‌ర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన పాత మ్యాప్‌లను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ప‌రిశీలించారు. 1971 – 72 స‌ర్వే ప్రకారం న‌గ‌రంలో ఎన్ని చెరువులున్నాయి.. ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి.. ప్రస్తుతం వాటి ప‌రిస్థతి ఏంటి. నాలాలు ఎలా.. ఎంత విస్తీర్ణంలో ఉండేవి.. ఇప్పుడు ఎంత మేర క‌బ్జా అయ్యాయని మ్యాప్‌లను ప‌రిశీలించారు ఏవీ రంగనాథ్‌. ద‌శాబ్దాల క్రితం నాటి మ్యాప్‌ల‌తో పాటు.. నేటి ప‌రిస్థితిని స‌రిపోల్చుతూ చెరువులు, నాలాల వివ‌రాల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్రద‌ర్శన ద్వారా స‌ర్వే ఆఫ్ ఇండియా అధికారులు వివ‌రించారు.

Samantha: ప్రతి అమ్మాయికి అలాంటి బ్రదర్ ఉండాలన్న సమంత.. త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇప్పటికే హెచ్ఎండీఏ, ఇరిగేష‌న్‌, జీహెచ్ ఎంసీ నుంచి సేక‌రించిన చెరువుల జాబితాతో.. స‌ర్వే ఆఫ్ ఇండియా వ‌ద్ద ఉన్న స‌మాచారాన్ని క్రోడీక‌రించి చెరువులు, నాలాల ప‌రిస్థితి, క‌నుమ‌రుగైన చెరువులపై ఓ అవగాహన రానుంది. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల నిర్ధారించ‌డంలో స‌ర్వే ఆఫ్ ఇండియాను కూడా భాగ‌స్వామ్యం చేయ‌డం.. స‌ర్వే ఆఫ్ ఇండియా అందించిన వివ‌రాల‌తో హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్ – మ‌ల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల‌పై స‌మ‌గ్ర నివేదిక త‌యారీ చేయ‌డం జరుగుతోందని హైడ్రా అధికారులు తెలిపారు. స‌ర్వే ఆఫ్ ఇండియా సేక‌రించిన డేటాను డిజిట‌లైజేష‌న్‌తో పాటు.. అస్సలు చెరువుల విస్తీర్ణం ఎంత‌, నాలాల పొడ‌వు, వెడ‌ల్పుల‌ను నిర్ధారించి పూర్తి వివ‌రాల‌తో నివేదిక‌ను సిద్ధంగా ఉంచ‌డం.. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్లను శాస్త్రీయ ప‌ద్ధతిలో నిర్ధారించి.. త‌దుప‌రి చ‌ర్యల‌ను చేప‌ట్టేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ప్రాధాన్య క్రమంలో చెరువుల‌ను ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా పున‌రుద్ధరించేందుకు హైడ్రా చ‌ర్యలు తీసుకోనుంది.

Ram Charan -Prashanth Neel: దానయ్య సమర్పించు ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్?