HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA: హైదరాబాద్‌లోని నార్సింగి ప్రాంతంలో చెరువుల పరిరక్షణ చర్యలను హైడ్రా అధికారులు వేగవంతం చేశారు. ముష్కి చెరువులో జరిగిన ఆక్రమణలపై దృష్టి సారించిన అధికారులు ఉదయం నుంచే రంగంలోకి దిగారు. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముష్కి చెరువులో 10 ఎకరాల మేర ఆక్రమణ జరిగినట్లు గుర్తించిన హైడ్రా, ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువు హద్దులను గుర్తించి కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఆక్రమణకు గురైన చెరువు భూమిలో నిర్మించిన భవనాలు, ఇతర నిర్మాణాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చెరువు పరిధిలో ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయి. చెరువు భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహించిన వారిపై సైతం అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వ భూములు, జలవనరుల పరిరక్షణలో భాగంగా ఆక్రమణలను తొలగించి చెరువులను పునరుద్ధరించేందుకు చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ముష్కి చెరువు ఆక్రమణల వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, చెరువుల సంరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పలువురు స్వాగతిస్తున్నారు.
ఇక, ముష్కి చెరువు FTL పరిధిలో ఉన్న ఆక్రమణలను పది రోజుల్లో తొలగించాలని గతంలో హైడ్రా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో నార్సింగి సర్కిల్ పరిధిలోని మై హోమ్ అవతార్ సమీపంలో ఉన్న ముష్కి లేక్‌ను అధికారులు సందర్శించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొనసాగుతున్న ఆక్రమణలపై సమగ్ర వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా అక్కడి భూముల యజమానులు, నివాసితులతో అధికారులు నేరుగా మాట్లాడారు. ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమిత ప్రాంతాలను స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు. గత రెండు నెలలుగా పలుమార్లు నోటీసులు జారీ చేసి ముందస్తు సమాచారం అందించామని అధికారులు తెలియజేశారు. స్థానికుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అధికారులు, ఇది చివరి అవకాశం అని స్పష్టం చేశారు. తాజాగా చెరువు చుట్టూ కంచె నిర్మాణం చేపడుతున్నారు.
Also Read
- Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?