HYDRA Commissioner : చందానగర్ డివిజన్ పరిధిలోని భక్షికుంట, రేగుల కుంట చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. తక్కువ నిధులతో ఈ చెరువులను అభివృద్ధి చేసిన తీరును క్షేత్ర స్థాయిలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఆనంద్ మల్లిగవాడ్ వివరించారు. చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా మళ్లించిన తీరును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అపర్ణ హిల్ రాక్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్లు STP ద్వారా మురుగు నీటిని శుద్ధి చేసి కాలువలోకి మల్లిస్తున్న తీరును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. దీప్తిశ్రీ నగర్‌లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్థానికులతో మాట్లాడారు.
దీప్తి శ్రీ నగర్‌లో ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించిన వారిపై హైడ్రా కమిషనర్‌కు స్థానికుల ఫిర్యాదు చేశారు. దాదాపు 5 వేల గజాల స్థలం కబ్జా కాకుండా చూడాలని స్థానిక హైడ్రా అధికారులను కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. రేగులకుంట, భక్షికుంట మాదిరే నగరంలో 10 చెరువులను మొదటి దశలో అభివృద్ది పనులు చేపడతామని హైడ్రా కమిషనర్ మీడియాకు వెల్లడించారు. చెరువులతో పాటు వివిధ కాలనీల్లో పార్కుల కోసం ఇతర ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను హైడ్రా కాపాడుతుందని రంగనాథ్ చెప్పారు.
Kailash Gahlot: బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి కైలాష్ గహ్లోట్