చందానగర్ డివిజన్ పరిధిలోని భక్షికుంట, రేగుల కుంట చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. తక్కువ నిధులతో ఈ చెరువులను అభివృద్ధి చేసిన తీరును క్షేత్ర స్థాయిలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఆనంద్ మల్లిగవాడ్ వివరించారు.
టపాసుల దుకాణ దారులు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. అబిడ్స్ బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన క్రాకర్స్ దుకాణ ప్రాంతాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన క్రాకర్స్ దుకాణాన్ని ఆ పక్కనే ఆహుతి అయిన టిఫిన్ సెంటర్‌ను పరిశీలించి ప్రమాదానికి కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు ఏవీ రంగనాథ్.