NTV Telugu Site icon

HYDRA: ఎన్ఆర్ఎస్సీ కార్యాలయానికి హైడ్రా కమిషనర్.. శాటిలైట్ ఇమేజీలు పరిశీలన

Hydra

Hydra

హైదరాబాద్ బాలన‌గ‌ర్‌లోని ఎన్ఆర్ఎస్సీ (నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్‌)కార్యాలయాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ సంద‌ర్శించారు. ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీ‌నివాస్‌తో హైడ్రా కమిషనర్ స‌మావేశ‌మయ్యారు. అనంతరం.. ఎన్ఆర్ఎస్సీలో ద‌శాబ్దాల నాటి శాటిలైట్ ఇమేజీల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాథ్ ప‌రిశీలించారు. చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ‌తో పాటు.. ప్రభుత్వ స్థలాల ప‌రిర‌క్షణ‌కు ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ ఇమేజీలు ప్రధాన పాత్ర పోషిస్తాయ‌ని క‌మిష‌న‌ర్‌ చెప్పారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను గుర్తించ‌డ‌మే కాకుండా.. లోత‌ట్టు ప్రాంతాల‌ను, వ‌ర‌ద ముప్పు ఉన్న ప్రాంతాల‌ను గుర్తించేందుకు కూడా ఈ ఇమేజీలు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయని రంగనాథ్ తెలిపారు.

Read Also: AP Fiber Net: ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది తొలగింపు.. త్వరలో మరో 200 మంది!

వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు ఏ ప్రాంతాలు నీట మునిగాయి.. వ‌ర‌ద కాలువ‌ల ఉధృతి, చెరువుల పూర్తి స్థాయి నీటి నిలువ సామ‌ర్థ్యం ఇలా అన్ని కోణాల్లో అంచ‌నా వేశారు. భ‌విష్యత్తులో వ‌ర‌ద ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకోడానికి తీసుకోవాల్సిన చ‌ర్యల‌కు ఇమేజీలను రంగనాథ్ ప‌రిశీలించారు. ఇప్పటికే స‌ర్వే ఆఫ్ ఇండియా, స‌ర్వే ఆఫ్ తెలంగాణ, గ్రామీణ మ్యాప్‌ల‌ నుంచి స‌మాచారాన్ని సేక‌రించిన హైడ్రా.. ఎన్ఆర్ఎస్సీ వ‌ద్ద ఉన్న హై రిజ‌ల్యూష‌న్ శాటిలైట్ ఇమేజీల ద్వారా మ‌రింత స్పష్టమైన స‌మాచారం తెలుస్తుంద‌ని క‌మిష‌న‌ర్‌ తెలిపారు..

Read Also: karnataka: స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా విద్యుత్ షాక్.. తల్లి, కొడుకుకు తీవ్రగాయాలు

ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ ఇమేజీలు ద్వారా చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ర‌హ‌దారులు, నాలాల ఆక్రమ‌ణ‌లపై క‌చ్చిత‌మైన స‌మాచారాన్ని సేక‌రించేందుకు హైడ్రా చ‌ర్యలు చేపట్టనుంది. చెరువుల ప‌రిర‌క్షణ‌లో ఎన్ఆర్ఎస్సీ కూడా భాగ‌స్వామ్యం కావాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ కోరారు. హైడ్రాతో భాగస్వామ్యం కావడానికి ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్‌ అంగీక‌రించారు. 1973 నుంచి 2024 వ‌ర‌కూ ఎక్కువ వ‌ర్షపాతం న‌మోదైన డేటా ఆధారంగా అప్పటి శాటిలైట్ ఇమేజీల ద్వారా చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్లను గుర్తించేందుకు హైడ్రా చ‌ర్యలు తీసుకోనుంది.

Show comments