Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Traffic Alert: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు సంబంధించి కీలక ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఉప్పల్ రింగ్ రోడ్‌పై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కారణంగా మూడు నెలల పాటు ఉప్పల్ రింగ్ రోడ్డును మూసివేయనున్నట్లు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. దీంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలు, అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నారు. అదేవిధంగా భారీ వాహనాలకు ప్రత్యేక ఆంక్షలు విధించగా, వాటికి ఘట్కేసర్ వరకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ మళ్లింపులపై అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు ఓ క్లారిటీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనే ఉన్న వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట బస్టాప్‌ను తాత్కాలికంగా నల్లచెరువు కట్ట ప్రాంతానికి మార్చారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు.. మేఫేర్ హోటల్ దాటిన తర్వాత ‘ఉప్పల్ భగాయత్ లేఅవుట్’ మీదుగా నాగోల్ చేరుకోవాలి. అక్కడ సర్వీస్ రోడ్డు గుండా వెళ్లి, ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని నగరంలోకి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు, సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ వద్ద పిస్తా హౌస్, బీరప్పగడ్డ మీదుగా జాతీయ రహదారి 163 (NH 163) కి చేరుకోవాలి. పీర్జాదిగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు.. ఉప్పల్ జంక్షన్‌కు రాకుండా, లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ వద్దకు చేరుకుని అక్కడ యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఉప్పల్ భగాయత్ రోడ్డు చాలా ఇరుకైనది కావడంతో భారీ వాహనాలను ఆ మార్గంలో అనుమతించడం లేదు. వాటి కోసం ప్రత్యేక మార్గాలను కేటాయించారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే భారీ వాహనాలు ఘట్కేసర్ వద్దే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి, హయత్‌నగర్ లేదా పెద్ద అంబర్‌పేట మీదుగా ఎల్బీనగర్ చేరుకోవాలి. సికింద్రాబాద్, రామంతాపూర్, హబ్సీగూడ నుంచి వరంగల్ వెళ్లే భారీ వాహనాలు నాచారం, మల్లాపూర్, ఐఓసీ (IOC) జంక్షన్, చెంగిచర్ల మీదుగా వరంగల్ హైవేకి వెళ్లాల్సి ఉంటుంది. అటుగా వెళ్లే ప్రయాణికులు ముందుగా పూర్తి వివరాలు తెలుసుకుని కొంచెం ముందుగా ప్రయాణం ప్రారంభించండి.
Also Read
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్‌పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్‌ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
తాజావార్తలు
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్‌పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..