Site icon NTV Telugu

Hyderabad: టోలీచౌకిలో విషాదం.. ఏడు అంతస్తుల భవన నిర్మాణంలో ప్రమాదం.. నలుగురు మృతి..

Hyderabad Tolichowki

Hyderabad Tolichowki

Hyderabad: హైదరాబాద్ టోలీచౌకిలో విషాదం చోటు చేసుకుంది. ఏడు అంతస్తుల భవనం నిర్మాణ సమయంలో భద్రతా లోపం వల్ల నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. ప్రమాద సమయంలో 10 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమాచారం.. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు ప్రారంభించింది. పోలీసులు సైతం అక్కడికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏడు అంతస్తుల కొత్త భవనానికి ప్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్లాస్టింగ్‌ చేసేందుకు కట్టిన కట్టెలు ఒక్కసారిగా విరిగి కూలిపోయాయి. దీంతో కార్మికులు పై నుంచి పడి చనిపోయినట్లు తెలుస్తోంది.

READ MORE: Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

Exit mobile version