NTV Telugu Site icon

Hyderabad: హైదరాబాద్‌లో ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్..

Fifa

Fifa

హైదరాబాద్‌ మరొక మెగా టోర్నమెంట్ కు వేదిక కానుంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్‌కు ఆతిధ్యమివ్వబోతుంది. ఇందుకోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఘనంగా ఏర్పాట్లు పూర్తిచేసింది. రేపు (సోమవారం) ఇండియా-మలేషియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.00 గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ ఫుట్ బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ మ్యాచ్ కు ఆతిధ్యం ఇచ్చిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ.. ఇప్పుడు ఇండియా, మలేషియా మధ్య ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తోంది.

Read Also: Mechanic Rocky Trailer 2.0: క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసిన పర్వాలేదు: విశ్వక్ సేన్

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు మ్యూజికల్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నారు. కాగా.. మెగా టోర్నమెంట్ ప్రారంభ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. అయితే.. ఈ తరహా ఫిఫా ఫ్రెండ్లీ కప్ హైదరాబాద్ నగరంలో జరగడం ఇదే మొదటిసారి. ఇక ఈ ఫుట్ బాల్ మ్యాచ్ కోసం నగరంలోని యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఇండియా, మలేషియా మధ్య జరగనున్న ఫిఫా ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్‌ను నవంబర్ 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

Read Also: Samagra Kutumba Survey: 58 శాతం పూర్తయిన ఇంటింటి సర్వే.. అత్యధికంగా ఈ జిల్లాలోనే