Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Hyderabad Rowdies Harassing Women Bonalu Cases

HYD Harassment: యువతులు, మహిళలను తాకుతూ శునకానందం.. వందలాది మంది ఆకతాయిలపై కేసులు!

Published Date :August 29, 2025 , 10:31 pm
By Sampath Kumar
  • యువతులు, మహిళలను తాకుతూ శునకానందం
  • వందలాది మంది ఆకతాయిలపై కేసులు
  • మొబైల్‌ ఫోన్‌తో రికార్డ్‌ చేసిన మహిళ
  • బైక్‌ నెంబర్‌ ఆధారంగా యువకుల గుర్తింపు
HYD Harassment: యువతులు, మహిళలను తాకుతూ శునకానందం.. వందలాది మంది ఆకతాయిలపై కేసులు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌లో పోకిరీల ఆగడాలు మితిమీరాయి. బోనాలు.. వినాయక వేడుకలు.. దేవీ నవరాత్రులు.. న్యూ ఇయర్‌.. హోలీ.. సందర్భమేదైనా సరే ఆకతాయిల టార్గెట్‌ అంతా అమ్మాయిలపైనే. కామెంట్‌ చేయడం.. యువతులను, మహిళలను తాకుతూ, వీడియోలు, ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. శునకానందం పొందుతున్నారు. తాజాగా బైక్‌ వెళ్తున్న మహిళలను.. యువకులు వెంబడిస్తూ నెమలి ఈకతో టచ్‌ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. వైరల్‌ ఐన వీడియో ఆధారంగా యువకులను గుర్తించి పట్టుకుని తాట తీశారు పోలీసులు.

హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా తాజాగా జరిగిన బోనాల ఉత్సవాల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. యువతులు, మహిళలను తాకుతూ శునకానందం పొందారు. ఇందులో యువకులే కాదు.. అంకుల్స్‌ కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్లందరి తాట తీశారు పోలీసులు. వాళ్లు చేస్తున్న వికృత చేష్టలను షీ టీమ్స్‌ వీడియోలతో సహా రికార్డ్‌ చేసింది. గుర్తించి పట్టుకుని కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇలా బోనాలు ముగిసే వరకు వందలాది మంది ఆకతాయిలపై కేసులు పెట్టారు.

తాజాగా మాదాపూర్‌లో కుర్రాళ్లు రెచ్చిపోయారు. బైక్‌ వెళ్తున్న యువతులను.. ముగ్గురు యువకులు బైక్‌పై వెంబడించడమే కాకుండా… వెనక కూర్చున్న యువకుడు నెమలి ఈకతో యువతులను కొడుతూ వేధించాడు. ఇలా కొద్ది దూరం వరకు వెంబడించి యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. ముగ్గురు యువకుల ప్రవర్తనతో భయాందోళనకు గురైన యువతులు బైక్‌ను వేగంగా పోనిచ్చే ప్రయత్నం చేశారు. ఐనా యువకులు వెంబడించారు. ఈ తతంగం అంతా… వెనకాలే వస్తున్న కారులోని మహిళ తన మొబైల్‌ ఫోన్‌తో రికార్డ్‌ చేసింది. యువకుల బైక్‌ సమీపం వరకు వెళ్లి.. వారించింది. ఏం చేస్తున్నారు.. అంటూ మందలించింది. దీంతో ఆ ముగ్గురు యువకులు స్పీడ్‌గా వెళ్లిపోయారు.

మొబైల్‌ ఫోన్‌తో రికార్డ్‌ చేసిన మహిళ.. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. పోలీసులకు ట్యాగ్‌ చేసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను గుర్తించిన పోలీసులు.. ఆ బైక్‌ నెంబర్‌ ఆధారంగా యువకులను గుర్తించారు. వరంగల్‌ కి చెందిన ముగ్గురు యువకులు.. హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు గుర్తించారు. చదువు, ఉద్యోగం లేకుండా.. జులాయిగా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న మాదాపూర్‌ పోలీసులు.. యువకుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. యువకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు పోలీసులు. ముగ్గురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఎవరూ గమనించరు కదా అని తుంటరి చేష్టలకు పాల్పడినా.. యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రానున్న వినాయక నిమజ్జనం, దేవీ నవరాత్రుల ఉత్సవాల్లోనూ ఇలాంటి చేష్టలకు పాల్పడే వాళ్లపై పోలీసుల నజర్‌ ఉంటుందని.. పిచ్చి చేష్టలకు పాల్పడితే కేసులు తప్పవని వార్నింగ్‌ ఇస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #eve teasing
  • Bonalu festival rowdies
  • harassment
  • hyderabad
  • Hyderabad harassment cases

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: నేతన్నలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ఉచిత విద్యుత్ అమలు.. వెల్లడించిన డిప్యూటీ సీఎం

  • YS Jagan : 1100 కోట్లు గంగలో పోసినట్టేనా..? అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ సంచలన లెక్కలు..!

  • Chandrababu: స్వర్ణాంధ్ర కోసం 6 సూత్రాలతో ముందుకెళ్తున్నాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • YS Jagan: రాజధాని విషయంలో ‘ప్లాన్-బి’ని చంద్రబాబు ఎందుకు తొక్కేస్తున్నారు? జగన్ సంచలన వ్యాఖ్యలు!

  • LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ తెలుగు టీజర్ రిలీజ్ .. ఫ్యూచర్ లో ప్రేమకథ ఇలా ఉంటుందా?

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions