Site icon NTV Telugu

Hyderabad Police : అదిరింది.. దుబాయ్‌లో హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు..!

Hyd Police

Hyd Police

Hyderabad Police : హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దుబాయ్‌లో జరుగుతున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025లో హైదరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసినందుకు గాను, ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కోటిక్స్ అవార్డులో హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ అవార్డును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) డీజీ సీవీ ఆనంద్ దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అందుకున్నారు. ఈ అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్-2025కు ప్రపంచంలోని 138 దేశాల నుండి ప్రముఖ పోలీసు అధికారులు హాజరయ్యారు. వారి మధ్య హైదరాబాద్ పోలీసులు మొదటి స్థానంలో నిలవడం విశేషం.

 Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మక అవార్డును సాధించడంలో నార్కోటిక్ వింగ్‌లోని అధికారులు, సిబ్బంది అంకితభావం, కృషి ఎంతో ఉందని కొనియాడారు. వారి నిరంతర ప్రయత్నాల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. అంతేకాకుండా, ఈ విజయం కేవలం తెలంగాణ పోలీసులకు మాత్రమే కాకుండా, యావత్ భారతదేశ పోలీసు దళానికి గర్వకారణమని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్ పోలీసులు తమ సత్తా చాటడం దేశానికే గర్వకారణమని ఆయన అన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం హైదరాబాద్ పోలీసులు చేస్తున్న కృషికి ఈ అవార్డు ఒక నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Operation Sindoor: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఏర్పాటుపై కేంద్ర అభిప్రాయమిదే!

Exit mobile version