Tspsc : పరీక్ష పేపర్ లీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నాపత్రం లీక్ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. టీఎస్పీఎస్సీ టౌన్ ప్లానింగ్ ఓ వర్సీస్ పరీక్షలు ఈ నెల 12న జరగాల్సి ఉంది. ఈ నెల 15,16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామాకాల విషయమై పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ లో సెక్రటరీగా పని చేసే వ్యక్తికి పీఏగా పనిచేసే ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఓ యువతి కోసం ప్రవీణ్ ఈ పేపర్ ను లీక్ చేసినట్లు అనుమాస్తున్నారు. సదరు యువతి సోదరుడి కోసం ప్రవీణ్ ను ట్రాప్ చేసినట్టుగా పోలీసులు డౌట్ వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Huge Fire : భారీ అగ్ని ప్రమాదం.. రోడ్డునపడ్డ 100పైగా కుటుంబాలు
Also Read
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
ప్రవీణ్ ను హానీ ట్రాప్ చేసిన యువతి సోదరుడి కోసం ఈ పేపర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. యువతి ప్రభుత్వ టీచర్ గా పని చేస్తుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. టీఎస్పీఎస్పీలో ఆడ్మిన్ విభాగంలో పనిచేసే రాజశేఖర్ ను ప్రశ్నాపత్రం గురించి ప్రవీణ్ అడిగారు.. సెక్షన్ ఆఫీసర్ సిస్టమ్ లో క్వశ్చన్ పేపర్ ఉంటుందని రాజశేఖర్ ప్రవీణు తెలపడంతో దానిని దొంగలించినట్లు తెలుస్తోంది.
Also Read : Pranitha Subhash: ‘బాపుబొమ్మ’లా ఉండాలంటే ఇవి తినాల్సిందే..
ఈ కంప్యూటర్ నుంచి ప్రవీణ్ డ్రైవ్ లో క్వశ్చన్ పేపర్ ను కాపీ చేసుకుని.. దాన్ని ప్రింట్ తీసి యువతికి పంపాడు. ఆ యువతి ఈ పేపర్ ను తనకు తెలిసిన మరో యువకుడికి పంపింది. ఈ యువకుడు మరో ముగ్గురికి షేర్ చేశాడు. ఈ క్రమంలో సుమారు రూ. 14 లక్షలను యువతి వసూలు చేసిందని పోలీసులు గుర్తించారు. అయితే యువతి రూ.14 లక్షల్లో ప్రవీణ్ కు రూ. 10 లక్షలు ఇచ్చినట్లు ఓ న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది. టీఎస్పీఎస్సీకి చెందిన కంప్యూటర్లు హ్యాక్ అయినట్లుగా తొలుత ప్రచారం సాగింది. అయితే టీఎస్పీఎస్సీ కంప్యూటర్స్ హ్యాక్ కాలేదని అధికారులు గుర్తించారు. పేపర్ లీకైనట్లుగా పోలీసులు గుర్తించారు. ఓ యువతి కోసం ప్రవీణ్ ఈ పేపర్ ను లీక్ చేసినట్లుగా గుర్తించారు. ఈకేసులో ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. త్వరలోనే కొత్త పరీక్షల తేదీలను ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!