Hyderabad: టీమిండియాలో హైదరాబాద్ యువకుడు మహమ్మద్ మాలిక్‌కు అవకాశం లభించింది. అండర్-19 ఏ జట్టులో చోటు దక్కించుకున్న మాలిక్ ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్‌గా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. నాంపల్లి మల్లెపల్లికి చెందిన ఈ యువ క్రికెటర్ వినూ మన్కడ్ ట్రోఫీలో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ టోర్నమెంట్‌లో మాలిక్ అత్యధిక వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
READ MORE: Delhi Blast 2025: ఢిల్లీ పేలుళ్లలో తెరపైకి PAFF పేరు.. ! PAFF ఏ ఉగ్ర సంస్థ అనుబంధమో తెలుసా?
తన అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన మాలిక్‌కి బీసీసీఐ అండర్-19 ఏ జట్టులో చోటు కల్పించింది. ఈనెల 17న బెంగళూరులో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న సిరీస్‌లో మాలిక్ టీమిండియా తరఫున ఆడనున్నాడు. ఈ అవకాశం తనకు ఎంతో గౌరవంగా అనిపిస్తోందని, భవిష్యత్తులో సీనియర్ ఇండియన్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించడం తన ప్రధాన లక్ష్యమని మాలిక్ వెల్లడించాడు. మాలిక్ ఎంపికతో హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో ఆనందం నెలకొంది. స్థానిక కోచ్‌లు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి మరో ప్రతిభావంతుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అందరూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Delhi Blast 2025: ఢిల్లీ పేలుళ్లలో తెరపైకి PAFF పేరు.. ! PAFF ఏ ఉగ్ర సంస్థ అనుబంధమో తెలుసా?
