Gautham Rao : కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సహకరించింది..
- బీఆర్ఎస్ ఓటింగ్ బహిష్కరణపై గౌతమ్ రావు తీవ్ర విమర్శలు
- ఎంఐఎం-కాంగ్రెస్ రహస్య బంధాన్ని ప్రజలు గుర్తించాలి
- ఎలక్షన్ కమిషన్‌కి బీఆర్ఎస్ గుర్తింపు రద్దుపై ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goutham Rao : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌతమ్ రావు ఓటమి అనంతరం తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తన కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకుందని ఆరోపిస్తూ, ఎలక్షన్ కమిషన్ ముందు ఈ విషయాన్ని ఉంచనున్నట్లు తెలిపారు.
“ఓటు వేయొద్దని మీ పార్టీ నేతలే చెబితే, మీరు రేపు ప్రజలను ఓటు వేయమని ఎలా అడుగుతారు?” అని ప్రశ్నించారు గౌతమ్ రావు. అలాగే, ఎంఐఎం పార్టీ చేతుల్లో కాంగ్రెస్ పనిచేస్తోందని, ఈ ఎన్నికల ఫలితంతో ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని స్పష్టమైందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఈ రహస్య ఐక్యతను గుర్తించాలి అని పిలుపునిచ్చారు.
Also Read
ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, తనకు ఓటేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీసియో సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు గౌతమ్ రావు. అంతేగాక, ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను, వారి అధిష్ఠానమే అడ్డుకుందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలంటూ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
అయితే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్ హాసన్ 63 ఓట్లతో గెలిచారు, కాగా గౌతమ్ రావు 25 ఓట్లు మాత్రమే పొందారు. బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో, ఈ ఎన్నికలు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారాయి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!