NTV Telugu Site icon

MLA House Arrest: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్ అరెస్టు

Mla

Mla

MLA House Arrest: హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ఆయన హౌసింగ్ బోర్డ్ వేలంపై నిరసన వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. హౌసింగ్ బోర్డ్ ఇప్పటికే 24 ఫ్లాట్లను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో రెండు ప్లాట్లు 2008 సంవత్సరంలో హెచ్ఎండిఏ 200 ఫీట్ల రోడ్డుగా నిర్ధారించారని తెలిపారు. కానీ, ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ అధికారులు ఆ రోడ్డును 80 ఫీట్ల రోడ్డుగా చూపించి, వేలం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వేలం వేయడాన్ని నిరసించారు. ఆయన వారితో ఆ ప్లాట్లను కొనుగోలు చేసినవారు రోడ్డు విస్తరణ కారణంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఈ ప్లాట్లను వేలం వేయడం కేవలం ప్రజల అన్యాయమే అని పేర్కొన్నారు.

Also Read: RT 75 : రవితేజ ‘మాస్ జాతర’ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.

ఈ రోజు ఉదయం 10:30 గంటలకు వేలం నిర్వహించాలని నిర్ణయించగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు, కార్యకర్తలు వ్యతిరేకంగా వేలాన్ని జరపకుండా తమ నిరసన వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిసిపి శ్రీనివాస్ రావు కు పిర్యాదు చేసి, వేలం వేసే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ పాలనపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇప్పటివరకు ఏం కూడా జరగలేదు. ఇప్పుడు గజం జాగ కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఘటనతో కూకట్ పల్లి నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరిన్ని పరిణామాలు వెలుగులోకి రానున్నాయి.

Also Read: Mumbai Crime: మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ప్రైవేట్ భాగాల్లో రాళ్లు, బ్లేడ్!