Hyderabad: హైదరాబాద్ దినదినం అభివృద్ధి చెందుతోంది.. గతంతో పోలిస్తే.. ఎన్నో మెరుగైన జీవన ప్రమాణాలు అందుబాటులోకి వచ్చాయి.. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందినవారు సైతం హైదరాబాద్‌లో ఉంటున్నారు.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి.. ఇప్పుడు మన సిటీ మరో అరుదైన గుర్తింపు తెచ్చుకుంది.. భారత దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో హైదరాబాద్ టాప్‌స్పాట్‌లో నిలిచింది.. మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ 2023లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.. పుణె, బెంగళూరు, చెన్నై ఇలా భారత దేశంలోని ఇతర నగరలు.. హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Read Also: Rajinikanth : రజినీకాంత్ విగ్రహానికి పాలాభిషేకం, ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్..
మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ 2023లో హైదరాబాద్ “భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం”గా ర్యాంక్ చేయబడింది.. ఈ జాబితాలో 153వ ర్యాంక్‌తో హైదరాబాద్ టాప్ స్పాట్‌లో నిలవగా.. ఆ తర్వాత 154వ ర్యాంక్‌తో పుణె రెండో స్థానం, 156వ ర్యాంక్‌తో బెంగళూరు మూడో స్థానం, 161 ర్యాంక్‌తో చెన్నై నాలుగో స్థానం, 164 ర్యాంక్‌తో ముంబై ఐదో స్థానం, 170 ర్యాంక్‌తో కోల్‌కతా ఆరో స్థానం, 172 ర్యాంక్‌తో న్యూఢిల్లీ ఏడో స్థానంలో నిలిచాయి.. 2023 సూచిక ప్రకారం వియన్నా (ఆస్ట్రియా), జూరిచ్ (స్విట్జర్లాండ్) మరియు వాంకోవర్ (కెనడా) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ సూచిక విదేశాలలో పనిచేసే ఉద్యోగుల జీవన నాణ్యతను అంచనా వేస్తుంది, ముఖ్యంగా కుటుంబాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా 500 నగరాల నుండి డేటాపై ఆధారపడి ఉంటుంది. వాతావరణం, పాఠశాలలు మరియు విద్య, వ్యాధి మరియు పారిశుద్ధ్య ప్రమాణాలు, హింస మరియు నేరాలు, భౌతిక దూరం మరియు కమ్యూనికేషన్‌ల సౌలభ్యం, సామాజిక-రాజకీయ వాతావరణం వంటి అంశాలపై ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుంది.
Read Also: Salaar Song: ‘సూరీడు’ బయటకి రాగానే స్టార్ట్ చేసారు… సోషల్ మీడియాని సీజ్
ఈ ర్యాంకింగ్స్‌లో చివరిది 2019లో ప్రచురించబడింది, అప్పుడు పుణె మరియు హైదరాబాద్ రెండూ 143వ స్థానాన్ని పంచుకున్నాయి. 2022లో, అంతర్జాతీయ ఉద్యోగులు నివసించడానికి అత్యంత ఖరీదైన నగరాలను మూల్యాంకనం చేస్తూ జీవన వ్యయం నగర ర్యాంకింగ్ విడుదల చేయబడింది. ముంబై 127వ ర్యాంక్‌తో అత్యంత ఖరీదైన భారతీయ నగరంగా అవతరించింది. దాని తర్వాత న్యూఢిల్లీ (155), చెన్నై (177), బెంగళూరు (178), హైదరాబాద్ (192) మరియు పుణె (201)వ ర్యాంక్‌తో ఉన్నాయి. ఇక, గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2023 అని పిలిచే సూచికలో, మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో పుణె రెండవ స్థానంలో నిలిచింది. 2018లో పుణె టాప్ ర్యాంక్ సాధించింది. హైదరాబాద్‌కు దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ రావడంపై ఆనందం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ 2015 నుంచి వరుసగా ఆరోసారి ఈ ఘనత సాధించిందని పేర్కొన్న ఆయన.. ఈ సందర్భంగా హైదరాబాద్ వాసులకు శుభాకాంక్షలు చెబుతున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
