Hyderabad: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని జాహ్నవి గుప్తాగా పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. జాహ్నవి ఇండిగో కెప్టెన్, మరో ఫ్రెండ్‌తో కలిసి పార్టీ చేసుకుంది. అనంతరం తన గదికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న సహచరులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు.
READ MORE: Bus Accident: మరో బస్సు ప్రమాదం.. హైటెన్షన్ వైర్ తగిలి బస్సు దగ్ధం
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జాహ్నవి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. జమ్మూకు చెందిన జాహ్నవి కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్నట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిగత సమస్యల కారణంగానే ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో ఇండిగో సిబ్బంది, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
READ MORE: Star Brothers : టాలీవుడ్ మార్కెట్‌పై కోలీవుడ్ బ్రదర్స్ స్ట్రాంగ్ ఫోకస్
