Hyderabad: నాలుగు రాళ్లు వెనకేసుకోమంటే 418 రాళ్లు వేసుకున్నాడు.. షాకైన డాక్టర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవితంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటారు పెద్దలు. ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలంటే అవకాశం ఉన్నప్పుడే డబ్బు పొదుపు చేసుకోవాలని సూచిస్తుంటారు. భవిష్యత్‌లో జీవితంగా సాఫీగా ఉంటుందని పెద్దలు సలహాలు ఇస్తుంటారు. కానీ ఓ వ్యక్తికి ఏమర్థమైందో.. ఏంటో తెలియదు గానీ.. ఏకంగా కడుపులో 418 రాళ్లు వెనకేసుకున్నాడు. ఇదేదో వింతగా అనిపించడంలేదు. మీరు చదువుతున్నది నిజమే. షాకింగ్ న్యూస్‌గా అనిపిస్తుందా? మీరే కాదు.. పరీక్షించిన వైద్యులకే కళ్లు బైర్లు కమ్మాయి. అసలు ఈ రాళ్లేంటో.. ఆ పేషెంట్ కథేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
హైదరాబాద్‌లో 60 ఏళ్ల వృద్ధుడు కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. ఆయా పరీక్షలు నిర్వహించిన తర్వాత మూత్రపిండాల్లో భారీగా స్టోన్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU)లో నిపుణులైన వైద్యుల బృందం రంగంలోకి దిగింది. అనంతరం శస్త్ర చికిత్స ద్వారా మొత్తం 418 రాళ్లను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి కిడ్నీలు 27 శాతమే పని చేస్తున్నాయని డాక్టర్లు తెలిపారు.
Also Read
ఇలా శస్త్ర చికిత్స ద్వారా ఇన్ని రాళ్లు తొలగించడం వైద్య విధానంలో ఇదొక గణనీయమైన పురోగతిగా వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఒక సూక్ష్మ కెమెరా మరియు లేజర్ ప్రోబ్స్, ప్రత్యేక పరికరాలను ఉపయోగించారు.
ఇదిలా ఉంటే ఎలాంటి సర్జికల్ ఓపెనింగ్స్ లేకుండానే ఈ రాళ్లను తొలగించారు. దీంతో గాయం మానడానికి.. అలాగే రోగి కూడా త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి ఈ రాళ్లను తొలగించారు. అధునాతన మైన ఇమేజింగ్ టెక్నాలజీతో పాటు అత్యాధునికి పరికారాలు ఉపయోగించి ఈ శస్త్ర చికిత్సను నిర్వహించారు.
మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న రోగులకు ఇదొక ఆశాజ్యోతిగా ఉంటుందని వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో డా. కె. పూర్ణ చంద్ర రెడ్డి, డాక్టర్. గోపాల్ ఆర్. డాక్టర్. దినేష్ నేతృత్వంలోని బృందం పాల్గొంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!