Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- సినిమా షూటింగ్ పేరుతో దారుణం
- యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం
- అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. సినిమా షూటింగ్లో అవకాశం ఇస్తామని నమ్మించి యువతిని గదికి తీసుకెళ్లి రెండు రోజుల పాటు అత్యాచారం చేయారు. బాధితురాలి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో ఇద్దరు అనాథ యువతులు నివాసం ఉంటున్నారు. వారు చిన్న చిన్న సినిమా షూటింగ్‌లు, ఈవెంట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు బాధిత యువతితో పరిచయం పెంచుకుని.. సినిమా షూటింగ్ ఉందంటూ మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఆ తర్వాత యువతిని సికింద్రాబాద్‌లోని ఓ గదికి తీసుకెళ్లిన నిందితుడు.. తన స్నేహితుడితో కలిసి ఆమెపై రెండు రోజుల పాటు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈ నెల 16న ర్యాపిడో బుక్ చేసి యువతిని తిరిగి పంపించారు.
Also Read
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
- Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
ఇంటికి వచ్చిన యువతి ఒంటిపై గాయాలు ఉండటాన్ని గమనించిన ఆమె స్నేహితురాలు వెంటనే గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. చికిత్స సమయంలో వైద్యులు ఏమి జరిగిందని ప్రశ్నించగా.. తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని బాధితురాలు వెల్లడించింది. దీంతో బాధితురాలి స్నేహితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు గుర్తుతెలియని యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సినిమా అవకాశాల పేరుతో యువతులను మోసం చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
-
Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!