Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khaja Moizuddin Murder Case: హైదరాబాద్‌లో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రెడ్‌హిల్స్ శాంతినగర్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణలో ఇది సాధారణ హిట్ అండ్ రన్ కేసు కాదని, పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని పోలీసులు నిర్ధారించారు.
భూ వివాదాల్లో ఖాజా మొయినుద్దీన్ అడ్డుగా మారుతున్నాడనే కారణంతో ప్రత్యర్థులు అతన్ని హత్య చేయాలని కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ హత్య కోసం ఏడాది కాలంగా సుపారీ ముఠాలతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ నెలలో కిషన్‌సింగ్ అలియాస్ పప్పుకు సుపారీ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. మొదట ఈ హత్యను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించాలని నిందితులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కారుతో ఢీకొట్టి ప్రమాదంలా చూపించాలని భావించిన ముఠా, ఇందుకోసం కారు స్టంట్స్‌లో నిపుణుడైన అభిజిత్‌ను రంగంలోకి దింపింది. హత్యకు ఉపయోగించేందుకు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసి పలుమార్లు రిహార్సల్స్ కూడా చేసినట్లు విచారణలో తేలింది.
Also Read
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
హత్యకు మూడు రోజుల ముందు నుంచే న్యాయవాది కదలికలపై నిందితులు నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 22న నారాయణగూడలోని ఓ హోటల్లో సుపారీ ముఠా సమావేశమై చివరి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం తెల్లవారుజామున ఖాజా మొయినుద్దీన్ ఇంటి వద్ద కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఘటనలో ఉపయోగించిన రెండు కార్లకు ఎలాంటి నష్టం జరగకపోవడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఇది సాధారణ హిట్ అండ్ రన్ కాదని స్పష్టంగా తేల్చారు. నెంబర్ ప్లేట్ లేని కారుతో దాడి చేసినట్లు గుర్తించారు.
ఈ కేసులో కిషన్‌సింగ్, వినయ్, నాని, అభిజిత్‌ల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వినయ్‌ను అదుపులోకి తీసుకుని టాస్క్‌ఫోర్స్ అధికారులు విచారిస్తున్నారు. కాగా అభిజిత్, నాని, కిషన్‌సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురిని పట్టుకుంటే అసలు సూత్రధారి ఎవరో బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..