Hyderabad High Court: హైకోర్టులో మరో లాయర్ ఒక్కసారిగా కుప్పకూలారు. కార్డియాక్ అరెస్ట్‌తో హైకోర్టు న్యాయవాది మృతి చెందారు. మృతుడిని ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని గేట్ కారేపల్లి గ్రామానికి చెందిన పరస అనంత నాగేశ్వరరావు (45)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. విధుల్లో భాగంగా నాగేశ్వరరావు నేడు హైదరాబాద్‌లోని హైకోర్టుకు వెళ్లారు.