Tragedy : లండన్ బీచ్ లో కొట్టుకుపోయిన హైదరాబాద్ అమ్మాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : హైదరాబాదుకు చెందిన యువతి లండన్ లో దుర్మరణం చెందింది. పరీక్షలు అయిపోయాయి.. సెలవు తీసుకొని ఇంటికొస్తానని చెప్పిన అమ్మాయి శాశ్వతంగా కన్నుమూసింది. ఒక్కగానొక్క బిడ్డ మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా మోటకొండూరుకు చెందిన కొమ్మారెడ్డి శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతులు నగరంలోని ఐఎస్‌సదన్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో ఉంటున్నారు. సాయి తేజస్వి కొమ్మారెడ్డి (24) సైదాబాద్‌లో ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ) పూర్తి చేశారు.
Read Also: Indravelli incident: మాయని ఇంద్రవెల్లి గాయాలు.. మారణకాండకు 42ఏళ్లు
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
లండన్‌లోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి గతేడాది సెప్టెంబర్‌లో వెళ్లారు. ఈ నెల 11న తన స్నేహితులతో కలిసి అక్కడి బ్రైటన్ బీచ్‌లో విహారయాత్రకు వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయారు. వెంట ఉన్న సహ విద్యార్థులు ఎమర్జెన్సీ రెస్పాన్స్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడి బలగాలు గాలించి తేజస్వి మృతదేహాన్ని గుర్తించి ససెక్స్ కౌంటీ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Read Also: Moon Bin: యంగ్ సెన్సేషన్, కొరియన్ పాప్ సింగర్ మూన్‌బిన్ మృతి
ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మృతదేహం రావడానికి సమయం పడుతుండటంతో నగరంలోని ఆమె కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఈ విషయంపై కేటీఆర్‌కు ట్వీట్ చేసిన తేజస్వి బంధువులు మృతదేహం ఇక్కడకు తరలించడానికి సహకరించాలని కోరారు. బుధవారం మృతురాలి ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడించారు. మృతదేహం శుక్రవారం నాటికి నగరానికి చేరుకుంటుందని ఆమె కుటుంబీకులకు సమాచారం అందింది.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?