Hyderabad: హైదరాబాద్ చేపల మార్కెట్లపై టీజీ ఫుడ్ సేఫ్టీ ఆకస్మిక దాడులు.. 200 కిలోల కుళ్లిన చేపలు సీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని ప్రధాన చేపల మార్కెట్లపై టీజీ ఫుడ్ సేఫ్టీ (TG Safe), వెటర్నరీ అధికారులు ప్రత్యేక తనిఖీలు (స్పెషల్ డ్రైవ్) నిర్వహించారు. వివిధ బృందాలుగా ఏర్పడిన అధికారులు బేగంబజార్, రామ్‌నగర్ మరియు ముషీరాబాద్ ప్రాంతాల్లోని చేపల మార్కెట్లలో ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా చేపల నాణ్యత, నిల్వ విధానాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. చేపలు తాజాగా కనిపించేందుకు హానికరమైన రసాయనాలు ముఖ్యంగా ఫార్మాలిన్ వినియోగిస్తున్నారా అనే కోణంలో నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి (SFL) పంపించారు. చాలా విక్రయ కేంద్రాల్లో తీవ్ర అపరిశుభ్రత నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు.
సోదాల్లో భాగంగా వివిధ దుకాణాల్లో భారీ మొత్తంలో కుళ్లిన చేపలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రామ్‌నగర్ బిన్సన్స్ ఫిషరీలో అపరిశుభ్ర వాతావరణం మధ్య నిల్వ ఉంచిన 65 కిలోల కుళ్లిన చేపలను గుర్తించారు. ముషీరాబాద్ జీబీకే (GBK) ఫిషరీస్‌లో 30 కిలోల కుళ్లిన చేపలు లభ్యమయ్యాయి. ఎస్వీఆర్ (SVR) షాప్‌లో 35 కిలోల కుళ్లిన తిలాపియా చేపలను సీజ్ చేశారు. రామ్‌నగర్‌లోని ఎస్‌కేకే ఫిష్ షాప్, ముషీరాబాద్‌లోని కేఎల్ఎం షాపుల్లో కలిపి మొత్తం 70 కిలోల కుళ్లిన చేపలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వ్యాపారులు, డీలర్లు, ఫిష్ సప్లయర్స్‌పై అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఫుడ్ లైసెన్సులు తీసుకోవాలని, నిర్ణీత గడువులోపు పరిశుభ్రమైన (హైజినిక్) వాతావరణంలోనే చేపల అమ్మకాలు జరపాలని అధికారులు వ్యాపారులను ఆదేశించారు.
Also Read
- Vangaveeti Radhakrishna: మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన వంగవీటి రాధాకృష్ణ.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే!
- IND vs NZ: 110 పరుగులకే 4 వికెట్లు.. అయినా భారత్‌కు చిక్కని కివీస్..!
- Kishan Reddy: కేబినెట్ భేటీకి వెళ్లకుండా.. అమిత్ షాను ఒప్పించి, మోడీ అనుమతితో యాత్ర కొనసాగిస్తున్నా..
- Hanuman Ansh OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన 'హనుమాన్ అంశ్'.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తాజావార్తలు
-
Hyderabad: హైదరాబాద్ చేపల మార్కెట్లపై టీజీ ఫుడ్ సేఫ్టీ ఆకస్మిక దాడులు.. 200 కిలోల కుళ్లిన చేపలు సీజ్!
-
Vangaveeti Radhakrishna: మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన వంగవీటి రాధాకృష్ణ.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే!
-
IND vs NZ: 110 పరుగులకే 4 వికెట్లు.. అయినా భారత్‌కు చిక్కని కివీస్..!
-
Kishan Reddy: కేబినెట్ భేటీకి వెళ్లకుండా.. అమిత్ షాను ఒప్పించి, మోడీ అనుమతితో యాత్ర కొనసాగిస్తున్నా..
-
Hanuman Ansh OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్ అంశ్’.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ట్రెండింగ్
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!