Diwali Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Diwali Fire Accidents: దీపావళి పండుగ వేళ హైదరాబాద్ నగరంలో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపాయి. నిన్నటి నుంచి నగరంలోని అనేక ప్రాంతాల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. కూకట్పల్లి, బేగంబజార్, జీడిమెట్ల, ఓల్డ్ బోయిన్పల్లి, సికింద్రాబాద్, మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్, అఫ్జల్‌గంజ్, సీతాఫల్మండి, చిలకలగూడ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్బెస్టాస్ కాలనీలో పేపర్ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న జీఆర్బీ నెయ్యి, హల్దీరామ్స్ గోదాములకు కూడా అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో మూడు కంపెనీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే ఈ ఘటనలో 4 టాటా ఏస్ వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల ధాటికి ఒకరు స్వల్పంగా గాయపడ్డారు కూడా. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. 5 ఫైర్ ఇంజిన్ల సహాయంతో గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Also Read
- Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
- Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
- India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
- Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
మరోవైపు బేగంబజార్‌లోని ఓ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. జీడిమెట్లలో స్క్రాప్ గోదాం, ఓల్డ్ బోయిన్‌పల్లిలో మెడికల్ గోదాం, సికింద్రాబాద్ బండిమెట్లోని బాలాజీ మెడికల్ షాప్‌లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మైలార్‌దేవ్‌పల్లిలో ప్లాస్టిక్ గోదాంలో మొదలైన మంటలు పక్కనే ఉన్న ప్లైవుడ్ పరిశ్రమకు వ్యాపించాయి. కాటేదాన్ పారిశ్రామిక వాడలో రెండు పరిశ్రమలు భారీగా నష్టపోయాయి. అఫ్జల్‌గంజ్‌లోని ఓ భవనంలోనూ మంటలు ఎగిసిపడ్డాయి.
మరోవైపు సీతాఫల్మండిలో టపాసుల దుకాణంలోకి తారాజువ్వ దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకున్న సంగతి విధితమే. అలాగే చిలకలగూడలోని మరో క్రాకర్స్ షాపులోనూ అగ్నిప్రమాదం జరిగింది. ఇలా వరుసగా పలు ప్రాంతాల్లో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. రాత్రంతా వివిధ ప్రాంతాల్లో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దీపావళి వేళ వరుస అగ్నిప్రమాదాలు నగరవాసులను ఆందోళనకు గురిచేశాయి.
తాజావార్తలు
-
Diwali Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అత్యంత జాగ్రత్త.. మీరున్నారో చూసుకోండి!
-
Delhi Air Pollution After Diwali: ఢిల్లీలో మళ్లీ తీవ్ర వాయు కాలుష్యం.. AQI 366కు చేరిక, పొగమంచుతో కప్పుకున్న నగరం
-
Iran Nuclear Talks: ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు?.. అణు చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!