Crime News: ముషీరాబాద్ ఫైనాన్సర్ హత్య.. వైజాగ్‌లో నిందితుడు అరెస్ట్
- ముషీరాబాద్ బోయిగూడ ప్రాంతంలో చోటుచేసుకున్న ఫైనాన్సర్ దారుణ హత్య
- వైజాగ్‌లో నిందితుడు అరెస్ట్
- హత్య అనంతరం సంప్‌లో మృతదేహాన్ని సంపూలో పడేసిన నిందితులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: హైదరాబాద్ ముషీరాబాద్ బోయిగూడ ప్రాంతంలో చోటుచేసుకున్న ఫైనాన్సర్ దారుణ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్‌ను వైజాగ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫైనాన్సర్ సట్నం సింగ్‌ను నవీన్ ఈ నెల 4వ తేదీన కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య అనంతరం సంప్‌లో మృతదేహాన్ని సంపూలో పడేసి నేరం నుంచి తప్పించుకునేందుకు వైజాగ్‌కు పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు.
Read Also: Noise Air Buds Pro 6: 24-బిట్ హై-క్వాలిటీ ఆడియో ఫీచర్ తో నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 లాంచ్
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
సట్నం సింగ్ మృతదేహంపై పలు కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసేందుకు కూడా నవీన్ ప్రయత్నించినట్టు విచారణలో వెల్లడైంది. పోలీసుల అనుమానాల ప్రకారం, సట్నం సింగ్ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బుల విషయంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగిందని, అదే కారణంగా ఈ దారుణ హత్య చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం సట్నం సింగ్ కనిపించకుండా పోవడంతో, అతని కుటుంబ సభ్యులు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటికే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అల్వాల్ పోలీసులు కేసును ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. డబ్బులు వసూలు చేసేందుకు ముషీరాబాద్‌లోని బోయిగూడ వెళ్లిన సట్నం సింగ్ అక్కడే కనిపించకుండా పోవడం ఈ ఘటనకు కారణమైంది. ప్రస్తుతం నవీన్‌ను అరెస్టు చేసిన పోలీసులు మరింత విచారణ చేపడుతున్నారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!