NTV Telugu Site icon

Kaushik Reddy : పండగ పూట కౌశిక్ రెడ్డికి కోర్టులో ఊరట..

Padi Kaushik Reddy

Padi Kaushik Reddy

నిన్న రాత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కౌశిక్‌ను పోలీసులు రాత్రంతా త్రీ టౌన్ పీఎస్ లోనే ఉంచారు. ఎమ్మెల్యేపై ఇప్పటికే వన్ టౌన్ లో మూడు, త్రీ టౌన్ లో రెండు, మొత్తం ఐదు కేసుల నమోదు చేశారు. రెండు కేసుల్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్డీవో మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు..మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

READ MORE: India Vs Pakistan: డాక్యుమెంటరీగా రాబోతున్న ‘ది గ్రేటెస్ట్ రైవల్రీ మ్యాచ్’.. ఎక్కడ చూడొచ్చంటే?

రాత్రి కౌశిక్ రెడ్డి నిద్రించేందుకు బెడ్ తెప్పించి ఏర్పాటు చేశారు. రాత్రి ఒంటిగంటకు అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్ లీగల్ టీంకు తెలిసింది. రాత్రి త్రీ టౌన్ లోనే వైద్య పరీక్షలు పూర్తి చేశారు. తాజాగా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. కేసులో వాదనలు ముగిశాయి.. కరీంనగర్ రెండవ అడిషనల్ జడ్జ్.. కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు.. కాసేపట్లో విడుదల కానున్నారు. పండగ పూట కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో భారీ ఊరట లభించినట్లయింది.

Show comments