Site icon NTV Telugu

Love Marriage: లవ్ మ్యారేజ్.. ఏడాది కూడా గడవకముందే దారుణం.. అసలు ఏం జరిగిందంటే?

Up

Up

ప్రేమ వివాహం చేసుకుని ఏడాదైన గడవకముందే భర్త దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమ వివాహం చేసుకున్న గోరఖ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు పత్రతులోని కిరిగఢ గ్రామంలో తన భార్యను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. డియోరియా జిల్లాకు చెందిన ఆ మహిళ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కాలువలో పడడంతో తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ఆర్‌పిఎఫ్ ఆ మహిళను రామ్‌గఢ్ సదర్ ఆసుపత్రిలో చేర్చి, ఆమె బంధువులకు సమాచారం అందించింది. రామ్‌గఢ్ జిల్లాలోని పత్రతు బ్లాక్‌లోని కిరిగఢ్ గ్రామం సమీపంలోని రైల్వే లైన్ సమీపంలో ఓ మహిళ గాయాలతో కాలువలో పడి ఉన్నట్లు గుర్తించారు. ఆ మహిళను డియోరియా జిల్లా నివాసి శంకర్ కుమార్ భార్య ఖుష్బూ కుమారిగా గుర్తించారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది.

Also Read:EMV Chip: డెబిట్ కార్డులో ఉండే చిన్న చిప్ ఒక మినీ కంప్యూటర్.. ఇది ఎలా పనిచేస్తుందంటే?

రైల్వే ఉద్యోగి ఆకాష్ పాస్వాన్ ఈ సంఘటన గురించి RPFకి సమాచారం అందించాడు. గ్రామస్తుల సహాయంతో ఆమెను 108 అంబులెన్స్‌లో పత్రతు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స తర్వాత, మహిళను రామ్‌ఘర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత, గాయపడిన ఖుష్బూ తన భర్త శంకర్ కుమార్ గోరఖ్‌పూర్ జిల్లా నివాసి అని పోలీసులకు చెప్పింది.

Also Read:Video : 12 గంటల్లో 1,113 మంది పురుషులతో సె*క్స్ చేసిన మహిళ

బుధవారం రాత్రి, బనారస్-బర్కకానా ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తుండగా, భర్త తనను తోసి కింద పడేశాడని ఖుష్బూ చెప్పింది. తాను ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నానని, కానీ గత కొన్ని నెలలుగా అతని ప్రవర్తన మారిపోయిందని, ప్రతి రోజు కొడుతూ చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని ఖుష్బూ చెప్పింది. ఆర్పీఎఫ్ సబ్-ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఖుష్బూ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఖుష్బూ ఆరోగ్యం నిలకడగా ఉందని నిందితుడైన భర్తను పట్టుకునేందుు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Exit mobile version