2019లో పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన ఆ తర్వాత హిందూ యువకుడితో కలిసి జీవించడానికి అక్రమంగా భారత్లోకి వచ్చిన సీమా హైదర్ పై ఉన్న ప్రేమను ఆమె భర్త గులాం హైదర్ వ్యక్తం చేశాడు. ఇప్పటికీ తన భార్యను తాను ప్రేమిస్తున్నానని, తిరిగి పాకిస్థాన్ కు వచ్చేయాలని అతడు కోరాడు. నలుగురు పిల్లల తల్లి అయిన సీమా.. ఉత్తరప్రదేశ్ లోని సచిన్ మీనాతో లవ్ లో పడి తన పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్ లోకి వచ్చిందని అతడు పేర్కొన్నాడు.
ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న సీమా మొదటి భర్త గులాం హైదర్.. తన భార్యను తన వద్దకు తిరిగి రావాలని కోరుకుంటున్నాని చెప్పాడు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు బాగా తెలుసు.. అక్కడ నీకేమైనా అయితే మన పిల్లలకు ఏం జరుగుతుందో ఆలోచించు.. వాళ్ల బాధ్యత ఎవరిది.. కాబట్టి వాళ్ల కోసమైనా దయచేసి తిరిగి పాకిస్తాన్ కు వచ్చేయని గులాం హైదర్ అన్నాడు. నేను ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను.. అది అలాగే ఉంటుంది.. పిల్లలను, నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నిన్ను నాతోనే ఉంచుకుంటాను అని గులాం అన్నాడు. మనం మళ్లీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం.. పాకిస్థాన్ లో నీకు భద్రత లేదని అనుకుంటే.. సౌదీలోనే పిల్లలతో పాటు మనం అక్కడే సెటిల్ అవుదాం అని గులాం హైదర్ పేర్కొన్నాడు.
Read Also: Health Tips : వీటిని రోజు తింటే యవ్వనంగా, మరింత అందంగా కనిపిస్తారు..!
తన మొదటి భార్యను వదిలేసి సీమ కోసం మరింత డబ్బు సంపాదించేందుకే సౌదీ అరేబియా వెళ్లినట్లు గులాం హైదర్ వెల్లడించాడు. గతంలో తాను సీమకు నెలకు రూ.40-50 వేలు పంపేవాడినని, కానీ తరువాత రూ.80-90 వేలు పంపించానని అతడు చెప్పాడు. ఆ డబ్బుతో పిల్లలను బాగా చూసుకుంటుందని అనుకున్నాను.. ఒక్కొసారి తన దగ్గర డబ్బు లేకపోయినా సీమ సొంతంగా ఇళ్లు కొనుక్కోవాలనే ఆమెకు రూ.17 లక్షలు పంపించాను అని హైదర్ తెలిపాడు. తన భార్య గురించి ఎవరూ అసత్యాలు ప్రచారం చేయకూడదని ప్రజలకు గులాం హైదర్ కోరాడు. తన భార్య బిడ్దలను పాకిస్థాన్ కు పంపించాలని భారత ప్రభుత్వానికి గులాం విజ్ఞప్తి చేశాడు.
Read Also: iPhone Ban in Russia: రష్యాలో ఐఫోన్స్ బ్యాన్.. ఎందుకో తెలుసా..?
తన భార్యను ప్రలోభాలకు గురిచేసి పబ్జీ ద్వారా ఇండియాకు రప్పించారని అతడు ఆరోపించాడు. తన భార్యను పాకిస్థాన్ కు పంపిస్తే, తాము సంతోషంగా మా ఫ్యామిలీతో కలిసి జీవిస్తామని భారత ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. అయితే, సీమ నేపాల్ మీదుగా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించింది. తరువాత సచిన్, సీమ, నలుగురు పిల్లలతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో నివసిస్తున్నారు. అయితే ఆమె నేపాల్ మీదుగా వీసా లేకుండా భారత్ లోకి అక్రమంగా వచ్చినందుకు జులై 4న పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు సహకరించినందుకు సచిన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సీమ పిల్లలను అనాథ ఆశ్రమంలో చేర్చారు. అయితే.. వీరిద్దరికీ శుక్రవారం బెయిల్ మంజూరైంది.