NTV Telugu Site icon

Crime : భార్యను హత్య చేసి సెప్టిక్‌ ట్యాంకులో పూడ్చిపెట్టిన భర్త

Tattoo Artist From Assam Found Dead

Tattoo Artist From Assam Found Dead

Crime : మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామంలో సోమవారం భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యను హత్య చేసి సెప్టిక్‌ ట్యాంకులో పూడ్చిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం, మారేపల్లి నారమ్మ (45) మరియు వెంకటయ్య దంపతులు. నారమ్మ ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేస్తుండగా, వెంకటయ్య గొర్రెల కాపరిగా పనిచేసేవాడు.
Pushpa 2: ఓవర్సీస్ లో మరో మైలురాయి చేరుకున్న’పుష్ప -2′

ఈ నెల 17న నారమ్మ కనిపించకపోవడంతో ఆమె భర్త వెంకటయ్య తన కుమారుడు భరత్‌కు సమాచారం అందించాడు. భరత్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 21న భరత్ తన తండ్రితో కలిసి భూత్పూర్ పోలీసులకు మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేశాడు. ఎస్సై చంద్రశేఖర్ ఈ కేసును నమోదు చేసి నారమ్మ ఆచూకీ కోసం అన్వేషణ ప్రారంభించారు.

సోమవారం ఉదయం గ్రామ పరిసర ప్రాంతంలో దుర్వాసన వ్యాపించడంతో గ్రామస్తులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే.. సెప్టిక్ ట్యాంక్‌లోని చెత్తను పరిశీలించగా, నారమ్మ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. నారమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

IPL 2025 Mega Auction: ముంబైకి ఆడనున్న యువ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్.. ఎన్ని కోట్లు పెట్టారో తెలుసా..?

Show comments