NTV Telugu Site icon

Crime News: దారుణం.. భార్యను హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేసిన భర్త

Murder

Murder

Crime News: జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తే ఆమెపాలిట కాలయముడై భార్యను అతి కిరాతకంగా చంపాడు. భార్యను చంపడమే కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా రైల్వే ట్రాక్‌పై పడేశాడు ఆ దుర్మార్గపు భర్త. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని దూళ్లవానిగూడెంలో చోటుచేసుకుంది. దూళ్లువానిగూడెంకు చెందిన రాజేష్, సునీతలు భార్యాభర్తలు. వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలోనే రాజేష్‌ ఆమెను హత్య చేయాలని ప్లాన్‌ రచించాడు. ఇంటి దగ్గర ఉన్న కాల్వలో ముంచి సునీతను భర్త రాజేష్ కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ప్లాన్‌ ప్రకారం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశారు. ట్రాక్‌పై మృతదేహం ఉన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సునీతను భర్త రాజేష్ హత్య చేశాడని తెలుసుకున్నారు. ప్రస్తుతం భర్త రాజేష్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Read Also: Tragedy: విషాదం.. హంసలదీవి బీచ్‌లో ఇద్దరు పర్యాటకులు గల్లంతు

Show comments