Husband Wife Fight : పెళ్లిరోజు మర్చిపోతారా అని భర్త, అత్తను చెప్పుతో కొట్టిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Wife Fight : పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఫర్లేదు కానీ.. వివాహం చేసుకున్న తర్వాత మాత్రం పుట్టినరోజుల నుండి పెళ్లి వార్షికోత్సవం వరకు అన్ని తేదీలను గుర్తుంచుకోవాలి. లేదంటే మీ భాగస్వామితో మీకు దబిడిదిబిడే.. ఇలాంటి ఘటనే ముంబైలోని ఘాట్కోపర్లో వెలుగులోకి వచ్చింది. ఈ వార్త వినగానే భర్తల్లో భయం పట్టుకుంది కదూ.. అయింటది లేండి. ముంబైకి చెందిన 27 ఏళ్ల యువతి తన వివాహ వార్షికోత్సవాన్ని మరచిపోయినందుకు తన భర్తను శిక్షించిన సంఘటన ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
ఈ ఘటన ఫిబ్రవరి 18న జరగ్గా, ఘట్కోపర్ పోలీసులు నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. వివాహ వార్షికోత్సవాన్ని మరచిపోయారన్న కోపంలో వివాహిత తన తల్లిదండ్రులను, సోదరుడిని తన అత్తమామల ఇంటికి పిలిపించింది. ఆ తర్వాత వారందరూ కలిసి ఆమె భర్త, అత్తగారిని కొట్టడం ప్రారంభించారు. అక్కడితో ఆగకుండా వారి వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. దీంతో నలుగురిపై దాడి కేసు నమోదు చేసినట్లు ఘట్కోపర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సంజయ్ దాహకే తెలిపారు. పోలీసులు వారికి నోటీసులు జారీ చేసి, విచారణ అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్‌తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
Read Also: Fake Eggs: మార్కెట్లో నకిలీ కోడిగుడ్లను గుర్తుపట్టాలి.. లేదంటే
ఇంతకీ ఏం జరిగిందంటే.. విశాల్ నాంగ్రే, కల్పన 2018లో పెళ్లి చేసుకున్నారు. విశాల్ నాంగ్రే కొరియర్ కంపెనీలో డ్రైవర్. భార్య కల్పన ఫుడ్ అవుట్‌లెట్‌లో పనిచేస్తుండగా, ఇద్దరూ గోవండిలోని బగన్వాడిలో నివసిస్తున్నారు. ఈ విషయమై చర్చించేందుకు మహిళ, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు అత్తగారింటికి వచ్చినట్లు సమాచారం. రాత్రి 9:30 గంటల సమయంలో జరిగిన గొడవలో కల్పన తన అత్తగారిని చెప్పుతో కొట్టింది.
Read Also: Union Minister Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట విషాదం..
ఆ తర్వాత విషయం తీవ్రస్థాయికి చేరి ఇద్దరికీ కొట్టుకున్నారు. కొట్టిన తర్వాత, వ్యక్తి తన తల్లితో కలిసి ఆసుపత్రికి వెళ్లి వైద్య నివేదిక అందుకున్న తర్వాత ఘట్కోపర్ పోలీసులను సంప్రదించాడు. తన భార్య సోదరుడు, తల్లిదండ్రులు తనను కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు నాంగ్రే భార్య, సోదరుడు మరియు అతని తల్లిదండ్రులపై భారతీయ శిక్షాస్మృతిలోని 323, 324, 327, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్‌తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
-
SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!