NTV Telugu Site icon

Tamil Nadu: తమిళనాడులో దారుణం.. భర్త ప్రాణాలు తీసిన భార్య సీరియల్ పిచ్చి!

Hanging

Hanging

Husband Lost His Life due to Wife’s Serial Madness: ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళలు తమ అభిమాన సీరియల్ వస్తుందంటే చాలు.. అన్ని పనులు పక్కనపెట్టి టీవీలకు అతుక్కుపోతుంటారు. సీరియల్ వస్తున్న సమయంలో పక్కన ప్రపంచాన్ని అస్సలు పట్టించుకోరు. భర్త, పిల్లలు ఛానెల్ మార్చమన్నా.. కొందరు ససేమిరా అంటారు. ఈ సీరియల్ పిచ్చి వలన భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ భర్త ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. భార్య సీరియల్ పిచ్చితో ఓ భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

వివరాలు ప్రకారం… తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులో భార్యాభర్తలు నిషా, ఆశీర్వాదం నివాసం ఉంటున్నారు. ఆశీర్వాదం ఆఫిస్ నుంటి ఇంటికి వచ్చే సరికి భార్య నిషా తనకు ఇష్టమైన సీరియల్ చూస్తోంది. ఛానల్ మార్చాలంటూ భార్య నిషాను ఆశీర్వాదం కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దాంతో ఆశీర్వాదంకు చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

ఛానల్ మార్చాలంటూ ఆశీర్వాదం పట్టుపట్టాడు. దాంతో చిన్న గొడవ కాస్త తీవ్ర స్ధాయికి చేరింది. నిషా కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అదే కోపంతో ఆశీర్వాదం కూడా ఇంటి నుండి బయటికి వెళ్లాడు. నిషా తిరిగి ఉదయం ఇంటికి రాగానే ఆశీర్వాదం ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భార్య నిషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments